తఱవాతి పను లెల్లఁ దా నెఱుఁగును
(॥పల్లవి॥)
తఱవాతి పను లెల్లఁ దా నెఱుఁగును
అఱిముఱిఁ జెలులాల అడుగరే యాతని
(॥॥)
తా నంపిన వుంగరము తగ నావేల నున్నది
కానుకలు నే నంపే కత లేఁటివే
తానకమై తన మీఁది తలఁపు నా కిచ్చినాఁడు
సానఁబట్టిన చూపుల సాదించే దేమే
(॥॥)
చెప్పి తా నంపిన మాట చెవులలోనే వున్నదీ
ముప్పిరిఁ జేసే విన్నపములు మరేవే
చిప్పిల దొర్లే సేసలు శిరసుపైఁ బెట్టి నాఁడు
గొప్ప గొప్ప కన్నులనుఁ గొసరే దేమే
(॥॥)
కూటమికి నా కౌఁగిలి గురిగాఁ జేసి వున్నదీ
పాటించి రతులలో నీపంతా లేడవే
యీటుగా శ్రీ వేంకటేశుఁడిట్టే నన్నుఁ గూడినాఁడు
కోటి సేసు నిఁక వేరే కొసరే దేమే
(||pallavi||)
taṟavādi panu lĕllam̐ dā nĕṟum̐gunu
aṟimuṟim̐ jĕlulāla aḍugare yādani
(||||)
tā naṁpina vuṁgaramu taga nāvela nunnadi
kānugalu ne naṁpe kada lem̐ṭive
tānagamai tana mīm̐di talam̐pu nā kichchinām̐ḍu
sānam̐baṭṭina sūbula sādiṁche deme
(||||)
sĕppi tā naṁpina māḍa sĕvulalone vunnadī
muppirim̐ jese vinnabamulu mareve
sippila dŏrle sesalu śhirasubaim̐ bĕṭṭi nām̐ḍu
gŏppa gŏppa kannulanum̐ gŏsare deme
(||||)
kūḍamigi nā kaum̐gili gurigām̐ jesi vunnadī
pāḍiṁchi radulalo nībaṁtā leḍave
yīḍugā śhrī veṁkaḍeśhum̐ḍiṭṭe nannum̐ gūḍinām̐ḍu
koḍi sesu nim̐ka vere kŏsare deme