Taṟavaadi maada lellaa dayya meṟumgu

తఱవాతి మాట లెల్లా దయ్య మెఱుఁగు
Language

(॥పల్లవి॥)
తఱవాతి మాట లెల్లా దయ్య మెఱుఁగు
యెఱుఁగనిదానఁ గాను యేమందు నేను

(॥తఱ॥)
మంతనము లాడుకొంటా మంచముపై గేరుకొంటా
యింతదడవు నుండరా యిద్దరు మీరు
అంతలో నే రా గానుఁఆపెఁ జూప యెవ్వ తెంటా
యెంత కెంత న న్నడిగే వేమందు నేను

(॥తఱ॥)
అంగము లురసుకొంటా నాయములు ముట్టుకొంటా
యెంగిలిపోత్తందుకోరా యిద్దరు మీరు
సంగడి నేఁ గూచుండఁగా సతి నా చెలి యనుచు
యింగితానఁ బే రడిగే వేమందు నేను

(॥తఱ॥)
కమ్మి కౌఁగిలించుకొంటా కాయము లుబ్బించుకొంటా
యిమ్ములఁ గూడి యుండరా యిద్దరు మీరు
పమ్మి నే దగ్గరఁ గాను పైకొని కూడితి విట్టె
యెమ్మెల శ్రీవేంకటేశ యేమందు నేను

(||pallavi||)
taṟavādi māḍa lĕllā dayya mĕṟum̐gu
yĕṟum̐ganidānam̐ gānu yemaṁdu nenu

(||taṟa||)
maṁtanamu lāḍugŏṁṭā maṁchamubai gerugŏṁṭā
yiṁtadaḍavu nuṁḍarā yiddaru mīru
aṁtalo ne rā gānum̐ābĕm̐ jūba yĕvva tĕṁṭā
yĕṁta kĕṁta na nnaḍige vemaṁdu nenu

(||taṟa||)
aṁgamu lurasugŏṁṭā nāyamulu muṭṭugŏṁṭā
yĕṁgilibottaṁdugorā yiddaru mīru
saṁgaḍi nem̐ gūsuṁḍam̐gā sadi nā sĕli yanusu
yiṁgidānam̐ be raḍige vemaṁdu nenu

(||taṟa||)
kammi kaum̐giliṁchugŏṁṭā kāyamu lubbiṁchugŏṁṭā
yimmulam̐ gūḍi yuṁḍarā yiddaru mīru
pammi ne daggaram̐ gānu paigŏni kūḍidi viṭṭĕ
yĕmmĕla śhrīveṁkaḍeśha yemaṁdu nenu