Tappulu vattamganela tarunulanu

తప్పులు వట్టఁగనేల తరుణులను
Language

(॥పల్లవి॥)
తప్పులు వట్టఁగనేల తరుణులను
కప్పురముమోవి నిచ్చి కాఁగిలింతురు

(॥తప్పు॥)
పెనఁగు రమణుఁడు ప్రియములు చెప్పినాను
చనవుగలసతులు జంకింతురు
తనిసి తమతమపంతము లీడేరినమీఁద
వెనక నప్పటి మరి వేఁడుకొందురు

(॥తప్పు॥)
యెడయక నాయకుఁడు ఇచ్చక మాడినాను
కడుపొందైనవారు కాఁతాళి తురు
తడయక రతులను తమకు లోనైనవేళ
చిడుముడిఁ జేయరాని సేవలెల్లాఁ జేతురు

(॥తప్పు॥)
అసల శ్రీవేంకటేశ ఆయలు నీ వెంతంటినా
సేసలు వెట్టినవారు చిమ్మిరేఁతురు
నీసరి నలమేల్మంగ నీవుర మెక్కినమీఁద
వాసుల నందరు నిట్టె వంతులకు వత్తురు

(||pallavi||)
tappulu vaṭṭam̐ganela taruṇulanu
kappuramumovi nichchi kām̐giliṁturu

(||tappu||)
pĕnam̐gu ramaṇum̐ḍu priyamulu sĕppinānu
sanavugalasadulu jaṁkiṁturu
tanisi tamadamabaṁtamu līḍerinamīm̐da
vĕnaga nappaḍi mari vem̐ḍugŏṁduru

(||tappu||)
yĕḍayaga nāyagum̐ḍu ichchaga māḍinānu
kaḍubŏṁdainavāru kām̐tāḽi turu
taḍayaga radulanu tamagu lonainaveḽa
siḍumuḍim̐ jeyarāni sevalĕllām̐ jeduru

(||tappu||)
asala śhrīveṁkaḍeśha āyalu nī vĕṁtaṁṭinā
sesalu vĕṭṭinavāru simmirem̐turu
nīsari nalamelmaṁga nīvura mĕkkinamīm̐da
vāsula naṁdaru niṭṭĕ vaṁtulagu vatturu