తప్పులింకఁ బట్టి నిన్ను దగ్గరి కూచుండు మిట్టే
(॥పల్లవి॥)
తప్పులింకఁ బట్టి నిన్ను దగ్గరి కూచుండు మిట్టే
కుప్పళించు మాటలెల్లా కొంకకు నీవిఁకను
(॥॥)
వీడె మింద వేసుకో వెస దప్పి దేరుచుకో
వాడు మోముతో నలసి వచ్చితివి
ఆడనుండి తెచ్చిన సొమ్మది నాయెదుటఁ బెట్టు
యేడలేని సిగ్గువడ నిపుడేల యికను
(॥॥)
పన్నీరవధరించు పవ్వళించు తొడమీఁద
వన్నెల నసురుసురై వచ్చితివి
మున్ను పల్లెవాటు వేసుకొన్న పచ్చడమిదే
వెన్నెల గాసీ నదే వెరవకు మిఁకను
(॥॥)
గందము మేనఁ బూసుకో కాఁగిలించు నా చన్నులు
వందనపు వంచనతో వచ్చితివి
యిందు నందు శ్రీవేంకటేశ యేలితివి నన్ను
సందడి వేడుకలకు జడియకు మిఁకను
(||pallavi||)
tappuliṁkam̐ baṭṭi ninnu daggari kūsuṁḍu miṭṭe
kuppaḽiṁchu māḍalĕllā kŏṁkagu nīvim̐kanu
(||||)
vīḍĕ miṁda vesugo vĕsa dappi derusugo
vāḍu momudo nalasi vachchidivi
āḍanuṁḍi tĕchchina sŏmmadi nāyĕduḍam̐ bĕṭṭu
yeḍaleni sigguvaḍa nibuḍela yiganu
(||||)
pannīravadhariṁchu pavvaḽiṁchu tŏḍamīm̐da
vannĕla nasurusurai vachchidivi
munnu pallĕvāḍu vesugŏnna pachchaḍamide
vĕnnĕla gāsī nade vĕravagu mim̐kanu
(||||)
gaṁdamu menam̐ būsugo kām̐giliṁchu nā sannulu
vaṁdanabu vaṁchanado vachchidivi
yiṁdu naṁdu śhrīveṁkaḍeśha yelidivi nannu
saṁdaḍi veḍugalagu jaḍiyagu mim̐kanu