తప్పులెంచవని నిన్ను దగ్గరితి నిటుగాక
(॥పల్లవి॥)
తప్పులెంచవని నిన్ను దగ్గరితి నిటుగాక
వొప్పగించే బీరాల కోపుదునా నేను
(॥తప్పు॥)
చిక్కని నీనవ్వులకు చేసేటి చేఁతలకు
యెక్కువగా నింతేసి మోహించితిఁగాక
తక్కుల నీగుట్లకు తచ్చన సన్నలకు
వొక్కమాఁటే యీపనులకోపుదునా నేను
(॥తప్పు॥)
కన్నుల నీమొక్కులకు కరుణారసానకు
కన్నెనయ్యే నీకు తాళి గట్టితిఁగాక
మిన్నక నీమేకులకు మేరలు మీరుటకు
వున్నతి నీరాఁపులకు నోపుదునా నేను
(॥తప్పు॥)
కలిసితివి రతికిఁ గడలేని మన్ననకు
పిలిచి నీకే సేస వెట్టితిఁగాక
యెలమి శ్రీవెంకటేశ యిట్టి నీవినయాలకు
వొళవుగా సిగ్గువడ నోపుదునా నేను
(||pallavi||)
tappulĕṁchavani ninnu daggaridi niḍugāga
vŏppagiṁche bīrāla kobudunā nenu
(||tappu||)
sikkani nīnavvulagu seseḍi sem̐talagu
yĕkkuvagā niṁtesi mohiṁchidim̐gāga
takkula nīguṭlagu tachchana sannalagu
vŏkkamām̐ṭe yībanulagobudunā nenu
(||tappu||)
kannula nīmŏkkulagu karuṇārasānagu
kannĕnayye nīgu tāḽi gaṭṭidim̐gāga
minnaga nīmegulagu meralu mīruḍagu
vunnadi nīrām̐pulagu nobudunā nenu
(||tappu||)
kalisidivi radigim̐ gaḍaleni mannanagu
pilisi nīge sesa vĕṭṭidim̐gāga
yĕlami śhrīvĕṁkaḍeśha yiṭṭi nīvinayālagu
vŏḽavugā sigguvaḍa nobudunā nenu