Tappulemcha mariyaala talavamchugonanela

తప్పులెంచ మరియాల తలవంచుకొననేల
Language

(॥పల్లవి॥)
తప్పులెంచ మరియాల తలవంచుకొననేల
చెప్పఁగల ప్రియములు చెప్పరమ్మా

(॥తప్పు॥)
చింతలెల్లాఁ బెడఁబాసె సెలవుల నవ్వదేరె
యింతలోనే విభుఁడు నీ యింటికి వచ్చె
పంతము లాడేరె నిఁక బంగారు పీఁట వెట్టి
వింతలేక యీతనికి విడె మియ్యవమ్మా

(॥తప్పు॥)
తనివిఁ బొఁదె మససు తలకూడెఁ గోరికలు
చెనకి నీమగఁడు నీచేతికిఁ జిక్కె
పనులెల్లాఁ జక్కనాయ పరపుపైఁ గూచుండి
వినయాన మోవి తేనె విందువెట్టవమ్మా

(॥తప్పు॥)
సేసిన చేఁతలు చెల్లె సిగ్గులు మోమున నిండె
ఆసతో శ్రీవేంకటేశుఁ డదె నిన్నేలె
రాసికెక్కె నీ వలపు రతులను మెప్పించి
మోసలేక వేఁడుకొని మొక్కు మొక్కవమ్మా

(||pallavi||)
tappulĕṁcha mariyāla talavaṁchugŏnanela
sĕppam̐gala priyamulu sĕpparammā

(||tappu||)
siṁtalĕllām̐ bĕḍam̐bāsĕ sĕlavula navvaderĕ
yiṁtalone vibhum̐ḍu nī yiṁṭigi vachchĕ
paṁtamu lāḍerĕ nim̐ka baṁgāru pīm̐ṭa vĕṭṭi
viṁtalega yīdanigi viḍĕ miyyavammā

(||tappu||)
tanivim̐ bŏm̐dĕ masasu talagūḍĕm̐ gorigalu
sĕnagi nīmagam̐ḍu nīsedigim̐ jikkĕ
panulĕllām̐ jakkanāya parabubaim̐ gūsuṁḍi
vinayāna movi tenĕ viṁduvĕṭṭavammā

(||tappu||)
sesina sem̐talu sĕllĕ siggulu momuna niṁḍĕ
āsado śhrīveṁkaḍeśhum̐ ḍadĕ ninnelĕ
rāsigĕkkĕ nī valabu radulanu mĕppiṁchi
mosalega vem̐ḍugŏni mŏkku mŏkkavammā