తప్పులేల వేసీనే తనుఁ గూడనైతి నంటా
(॥పల్లవి॥)
తప్పులేల వేసీనే తనుఁ గూడనైతి నంటా
యిప్పుడేమాయనే తాను యిరవైతేఁ జాలు
(॥॥)
దవ్వుల జాణతనాలు తానాడె నింతే కాక
వువ్విళ్ళూర నట్టే వచ్చి వొడివట్టెనా
నవ్వులకందరిలోన నన్నుఁ గలపెఁ గాక
నివ్వటిల్లు రతులకు నెట్టుకొనెనా
(॥॥)
అలవోకగా నన్ను నాయములంటీఁ గాక
చలపట్టి కాఁగిలించవలె ననెనా
కలపుకోలు చుట్టరికము లటు చూపీఁ గాక
చలువగా నామోవి చవిచూపు మనెనా
(॥॥)
పానుపుపైఁ బండి తనపాదాలు గుద్దించెఁ గాక
తానే నాపై మోహించి తమకించెనా
యీనెపాన శ్రీవేంకటేశుఁడిట్టె నన్నుఁ గూడె
అనుక ఇందాఁకా నింత అంకెలఁ జొక్కించెనా
(||pallavi||)
tappulela vesīne tanum̐ gūḍanaidi naṁṭā
yippuḍemāyane tānu yiravaidem̐ jālu
(||||)
davvula jāṇadanālu tānāḍĕ niṁte kāga
vuvviḽḽūra naṭṭe vachchi vŏḍivaṭṭĕnā
navvulagaṁdarilona nannum̐ galabĕm̐ gāga
nivvaḍillu radulagu nĕṭṭugŏnĕnā
(||||)
alavogagā nannu nāyamulaṁṭīm̐ gāga
salabaṭṭi kām̐giliṁchavalĕ nanĕnā
kalabugolu suṭṭarigamu laḍu sūbīm̐ gāga
saluvagā nāmovi savisūbu manĕnā
(||||)
pānububaim̐ baṁḍi tanabādālu guddiṁchĕm̐ gāga
tāne nābai mohiṁchi tamagiṁchĕnā
yīnĕbāna śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ nannum̐ gūḍĕ
anuga iṁdām̐kā niṁta aṁkĕlam̐ jŏkkiṁchĕnā