Tappulela pattevu taruni nappadi neevu

తప్పులేల పట్టేవు తరుణి నప్పటి నీవు
Language

(॥పల్లవి॥)
తప్పులేల పట్టేవు తరుణి నప్పటి నీవు
చప్పరింపుమాఁటలు సాజమే కాదా

(॥తప్పు॥)
పతి సన్నసేసితేను పనిలేనిపనికైనా
సతులు జంకించేది సాజమేకాదా
రతికి రాయడించితే రాజసాన జంపు సేసి
చతురతఁ దిట్టేది సాజమే కాదా

(॥తప్పు॥)
చేరి కొంగువట్టేవానిఁ జిగిరింపుఁగాఁకలతో
సైరణతోఁ జూచేది సాజమే కాదా
మేరమీరి కాఁతాళించి మీఁద మీఁదఁ బొదిగితే
సారె సిగ్గులు వడేది సాజమేకాదా

(॥తప్పు ॥)
అంకెల నీవు గూడఁగా నట్టె శ్రీవేంకటేశ్వర
జంకించి మోవడిగేది సాజమేకాదా
లంకెలై మీరిద్దరును లావులఁ బెనఁగేవేళ
సంకెలెల్ల మానేది సాజమేకాదా

(||pallavi||)
tappulela paṭṭevu taruṇi nappaḍi nīvu
sappariṁpumām̐ṭalu sājame kādā

(||tappu||)
padi sannasesidenu panilenibanigainā
sadulu jaṁkiṁchedi sājamegādā
radigi rāyaḍiṁchide rājasāna jaṁpu sesi
saduradam̐ diṭṭedi sājame kādā

(||tappu||)
seri kŏṁguvaṭṭevānim̐ jigiriṁpum̐gām̐kalado
sairaṇadom̐ jūsedi sājame kādā
meramīri kām̐tāḽiṁchi mīm̐da mīm̐dam̐ bŏdigide
sārĕ siggulu vaḍedi sājamegādā

(||tappu ||)
aṁkĕla nīvu gūḍam̐gā naṭṭĕ śhrīveṁkaḍeśhvara
jaṁkiṁchi movaḍigedi sājamegādā
laṁkĕlai mīriddarunu lāvulam̐ bĕnam̐geveḽa
saṁkĕlĕlla mānedi sājamegādā