Tappu lemchenaa nee talampulodaananu

తప్పు లెంచేనా నీ తలఁపులోదానను
Language

(॥పల్లవి॥)
తప్పు లెంచేనా నీ తలఁపులోదానను
వొప్పఁజెప్పి నన్నునెంత వొడఁబరచేవు

(॥తప॥)
చూడఁజూడ చూపులకు చోద్యములు నీచేఁతలు
ఆడుకొన నందరికి నబ్బురములు
తోడ దిష్టాలైయున్నవి తొల్లె రేపల్లెవాడల
యీడ మాతో వట్టిబాస లేలసేసే విఁకను

(॥తప॥)
వినవిన వీనులకు వేడుకలు నీగుణాలు
వొనరఁ దలఁచుకొంటే నుబ్బురేఁచేవి
వినుతింప మదురలో వెల్లవిరులై యున్నవి
మనసులొ మఱవము మఱఁగేల పెట్టేవు

(॥తప॥)
కొరకొరఁ గాఁగిటికిఁ గొనసాగె నీపొందులు
నేరిచితే రతులకు నిదానములు
యీరీతి శ్రీవేంకటేశ యెన్నికలై యున్నవి
చేరి నన్నేలితి వెంత సెలవుల నవ్వేవు

(||pallavi||)
tappu lĕṁchenā nī talam̐pulodānanu
vŏppam̐jĕppi nannunĕṁta vŏḍam̐barasevu

(||taba||)
sūḍam̐jūḍa sūbulagu sodyamulu nīsem̐talu
āḍugŏna naṁdarigi nabburamulu
toḍa diṣhṭālaiyunnavi tŏllĕ reballĕvāḍala
yīḍa mādo vaṭṭibāsa lelasese vim̐kanu

(||taba||)
vinavina vīnulagu veḍugalu nīguṇālu
vŏnaram̐ dalam̐sugŏṁṭe nubburem̐sevi
vinudiṁpa maduralo vĕllavirulai yunnavi
manasulŏ maṟavamu maṟam̐gela pĕṭṭevu

(||taba||)
kŏragŏram̐ gām̐giḍigim̐ gŏnasāgĕ nībŏṁdulu
neriside radulagu nidānamulu
yīrīdi śhrīveṁkaḍeśha yĕnnigalai yunnavi
seri nannelidi vĕṁta sĕlavula navvevu