Tappu jaduvulavaara targavaadamulavaara

తప్పు జదువులవార తర్కవాదములవార
Language

(॥పల్లవి॥)
తప్పు జదువులవార తర్కవాదములవార
యెప్పుడు నింతట దైవ మింకఁ దెచ్చేరా

(॥తప్పు॥)
కోరి సప్త ఋషులును కొలిచేదైవ మితఁడు
చేరి మహాశేషుఁడు మోచిన దైవము
గారవపు టాదిలక్ష్మి కైకొన్న దైవ మితఁడు
మేరతో నింతదైవము మీరు దెచ్చేరా

(॥తప్పు॥)
అల బ్రహ్మకునుఁ దండ్రియైన దైవ మితఁడె
తలప రుద్రునికిన తాత యితఁడె
వెలయ వేదములెల్ల వెదకే దైవ మితఁడు
యిల నింతటిదైవ మింకఁ దెచ్చేరా

(॥తప్పు॥)
నారదశుకాదులెల్ల నమ్మినదైవ మితఁడు
కూరిమి భూకాంతకు కులదైవము
ఆరీతి శ్రీ వేంకటాద్రిమీఁది దైవము
నేరితి యింతదైవము నెమకి తెచ్చేరా

(||pallavi||)
tappu jaduvulavāra targavādamulavāra
yĕppuḍu niṁtaḍa daiva miṁkam̐ dĕchcherā

(||tappu||)
kori sapta ṛṣhulunu kŏlisedaiva midam̐ḍu
seri mahāśheṣhum̐ḍu mosina daivamu
gāravabu ṭādilakṣhmi kaigŏnna daiva midam̐ḍu
merado niṁtadaivamu mīru dĕchcherā

(||tappu||)
ala brahmagunum̐ daṁḍriyaina daiva midam̐ḍĕ
talaba rudrunigina tāda yidam̐ḍĕ
vĕlaya vedamulĕlla vĕdage daiva midam̐ḍu
yila niṁtaḍidaiva miṁkam̐ dĕchcherā

(||tappu||)
nāradaśhugādulĕlla namminadaiva midam̐ḍu
kūrimi bhūgāṁtagu kuladaivamu
ārīdi śhrī veṁkaḍādrimīm̐di daivamu
neridi yiṁtadaivamu nĕmagi tĕchcherā