Tappimchugonaraadu talamgaa raadu

తప్పించుకొనరాదు తలఁగా రాదు
Language

(॥పల్లవి॥)
తప్పించుకొనరాదు తలఁగా రాదు
చెప్పితి నిట్టె మన్నించి చిత్తానఁ బెట్టుమీ

(॥॥)
నాతలఁపుకొడి సాగి నంటు నంటునఁ దీగెవంటిది
ఆతలనీతల నీమై నల్లుకున్నదా
కాతరపునాచూపు గబ్బి తుమ్మిదవంటిది
గాతల నీయందే గూఁడుగాఁబెట్టుకున్నది

(॥॥)
వేడుక నాయాస ఇది వేఁటమెకమువంటిది
కూడి నీపాదాలఁ దగులుకున్నది
వోడక నావలపు నీవొళ్లినీడవంటిది
వీడక నీవెంటవెంట వెసఁ బాయకున్నది

(॥॥)
దాఁగక నాచన్నులివి తమ్మి మొగ్గలవంటిది
కాఁగిటిలో నీకుఁబూజై కాచుకున్నది
చేఁగదేర నేలితివి శ్రీ వేంకటేశ నన్ను
మాఁగిననామోవితేనె మంచివిందై వున్నది

(||pallavi||)
tappiṁchugŏnarādu talam̐gā rādu
sĕppidi niṭṭĕ manniṁchi sittānam̐ bĕṭṭumī

(||||)
nādalam̐pugŏḍi sāgi naṁṭu naṁṭunam̐ dīgĕvaṁṭidi
ādalanīdala nīmai nallugunnadā
kādarabunāsūbu gabbi tummidavaṁṭidi
gādala nīyaṁde gūm̐ḍugām̐bĕṭṭugunnadi

(||||)
veḍuga nāyāsa idi vem̐ṭamĕgamuvaṁṭidi
kūḍi nībādālam̐ dagulugunnadi
voḍaga nāvalabu nīvŏḽlinīḍavaṁṭidi
vīḍaga nīvĕṁṭavĕṁṭa vĕsam̐ bāyagunnadi

(||||)
dām̐gaga nāsannulivi tammi mŏggalavaṁṭidi
kām̐giḍilo nīgum̐būjai kāsugunnadi
sem̐gadera nelidivi śhrī veṁkaḍeśha nannu
mām̐ginanāmovidenĕ maṁchiviṁdai vunnadi