తప్పించుకొనఁగలఁడా దాఁటవచ్చునా తనకు
(॥పల్లవి॥)
తప్పించుకొనఁగలఁడా దాఁటవచ్చునా తనకు
మెప్పించేఁ గాని పానుపుమీఁదికి రమ్మనవే
(॥॥)
మగువలమాఁటలు మంచిచక్కెరతీపులు
నగువు లందులోనికి నానఁబాలు
వెగటుగా దెఁతైనా వేగినంతా నాడినాను
చిగిరించి చిగిరించి చిమ్మిరేఁచు ననవే
(॥॥)
పొదలుగుబ్బలు వలపులబోనపుదొంతులు
కదలుకను చూపులు కప్రవిడేలు
అదనఁ బెనఁగితేను ఆసలాసలు వుట్టించు
పొదిగిపొదిగి కడుఁబోది సేసు ననవే
(॥॥)
కలసినకాఁగిలి కమ్మపూవుచప్పరము
బలిమి మోవిరసాలు పానకాలు
యెలమి శ్రీ వేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
తలపించి తలపించి తగిలించుననవే
(||pallavi||)
tappiṁchugŏnam̐galam̐ḍā dām̐ṭavachchunā tanagu
mĕppiṁchem̐ gāni pānubumīm̐digi rammanave
(||||)
maguvalamām̐ṭalu maṁchisakkĕradībulu
naguvu laṁdulonigi nānam̐bālu
vĕgaḍugā dĕm̐tainā veginaṁtā nāḍinānu
sigiriṁchi sigiriṁchi simmirem̐su nanave
(||||)
pŏdalugubbalu valabulabonabudŏṁtulu
kadaluganu sūbulu kapraviḍelu
adanam̐ bĕnam̐gidenu āsalāsalu vuṭṭiṁchu
pŏdigibŏdigi kaḍum̐bodi sesu nanave
(||||)
kalasinagām̐gili kammabūvusapparamu
balimi movirasālu pānagālu
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
talabiṁchi talabiṁchi tagiliṁchunanave