తప్పితారిన పనికి తగ నేమి సేయవచ్చు
(॥పల్లవి॥)
తప్పితారిన పనికి తగ నేమి సేయవచ్చు
చిప్పిల నేఁ గంటినంటా సిగ్గువడనేఁటికి
(॥తప్పి॥)
చెక్కుపై చెమట చెలి చేతఁ దీసివేసితేను
మిక్కుటమై సంగడి నీమేన నిండెను
అక్కజపు గందవొడి యందుపైఁజల్లుకోవయ్య
చొక్కపు సతులు నీపై చొప్పులెత్తకుండాను
(॥తప్పి॥)
కొప్పు వేఁకము గాఁగాను కొమ్మ విదలించితేను
పుప్పతిల్లి విరులు నీవొళ్లిపై రాలె
దుప్పటి మఱఁగుగాను తోడనే కప్పుకోవయ్య
ముప్పిరిఁ గాంతలు నిన్నుఁ దప్పులెంచకుండాను
(॥తప్పి॥)
నిన్ను నలమేలుమంగ నెమ్మదిఁ గాఁగిలించితే
చన్నుల మీఁది కుంకుమ చాలా నంటెను
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
పన్నీరు చల్లుకోవయ్యా కన్నె లాడకుండాను
(||pallavi||)
tappidārina panigi taga nemi seyavachchu
sippila nem̐ gaṁṭinaṁṭā sigguvaḍanem̐ṭigi
(||tappi||)
sĕkkubai sĕmaḍa sĕli sedam̐ dīsivesidenu
mikkuḍamai saṁgaḍi nīmena niṁḍĕnu
akkajabu gaṁdavŏḍi yaṁdubaim̐jallugovayya
sŏkkabu sadulu nībai sŏppulĕttaguṁḍānu
(||tappi||)
kŏppu vem̐kamu gām̐gānu kŏmma vidaliṁchidenu
puppadilli virulu nīvŏḽlibai rālĕ
duppaḍi maṟam̐gugānu toḍane kappugovayya
muppirim̐ gāṁtalu ninnum̐ dappulĕṁchaguṁḍānu
(||tappi||)
ninnu nalamelumaṁga nĕmmadim̐ gām̐giliṁchide
sannula mīm̐di kuṁkuma sālā naṁṭĕnu
yinniḍā śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
pannīru sallugovayyā kannĕ lāḍaguṁḍānu