తప్పని బొంకని యట్టి దామోదర నాకు
(॥పల్లవి॥)
తప్పని బొంకని యట్టి దామోదర నాకు
దప్పిదేర మో వియ్యవో దామోదరా
(॥తప్ప॥)
తరితీపుమాట లెల్ల దామోదరా నీకు
తరుణులు వేరిపిరా దామోదరా
దరిచేరె సంకు నీచే దామోదరా నీవు
తరగరివె తగు దామోదరా
(॥తప్ప॥)
తగులు వీరి పందేల దామోదరా నీ
తగవు లేల చెప్పేవు దామోదరా
దగదొట్టి పలికేవు దామోదరా వెను
తగిలితి విందాఁక దామోదరా
(॥తప్ప॥)
తల యెత్తు మా ముందర దామోదరా నీ
తళుకుమోవి చూచి దామోదరా
తలకొని కూడితివి దామోదరా యింక
తలఁగకు శ్రీవేంకటదామోదరా
(||pallavi||)
tappani bŏṁkani yaṭṭi dāmodara nāgu
dappidera mo viyyavo dāmodarā
(||tappa||)
taridībumāḍa lĕlla dāmodarā nīgu
taruṇulu veribirā dāmodarā
dariserĕ saṁku nīse dāmodarā nīvu
taragarivĕ tagu dāmodarā
(||tappa||)
tagulu vīri paṁdela dāmodarā nī
tagavu lela sĕppevu dāmodarā
dagadŏṭṭi paligevu dāmodarā vĕnu
tagilidi viṁdām̐ka dāmodarā
(||tappa||)
tala yĕttu mā muṁdara dāmodarā nī
taḽugumovi sūsi dāmodarā
talagŏni kūḍidivi dāmodarā yiṁka
talam̐gagu śhrīveṁkaḍadāmodarā