తప్పక యేమి చూచేవు తగిలి నన్ను
(॥పల్లవి॥)
తప్పక యేమి చూచేవు తగిలి నన్ను
తెప్పలుగా నీ విన్నియుఁ దెలియనివున్నవా
(॥తపక॥)
నీవు సుద్దులు చెప్పఁగా నివ్వెరనుండుట గాక
ఆవేళ నేవిననోప ననవచ్చునా
కైవసమై వున్నదానఁ గాకుసేతునా నిన్ను
దేవరవు నీవిన్నియుఁ దెలియనివున్నవా
(॥తపక॥)
చిట్టికపు చేఁతల కచ్చెరువు నొందుట గాక
వుట్టిపడి అవి యోర్వకుండవచ్చునా
పట్టిపుదేవుల నేను పచ్చిసేతునా నిన్ను
దిట్టివు నీవిన్నియునుఁ దెలియనివున్నవా
(॥తపక॥)
కగ్గుచు నీరతులకేఁకటతో నుండుట గాక
సిగ్గుతోడఁ గొంకుచు వంచించవచ్చునా
యెగ్గుల శ్రీవేంకటేశ యెరవు సేతునా నిన్ను
దిగ్గజమ విన్నియునుఁ దెలియనివున్నవా
(||pallavi||)
tappaga yemi sūsevu tagili nannu
tĕppalugā nī vinniyum̐ dĕliyanivunnavā
(||tabaga||)
nīvu suddulu sĕppam̐gā nivvĕranuṁḍuḍa gāga
āveḽa nevinanoba nanavachchunā
kaivasamai vunnadānam̐ gāgusedunā ninnu
devaravu nīvinniyum̐ dĕliyanivunnavā
(||tabaga||)
siṭṭigabu sem̐tala kachchĕruvu nŏṁduḍa gāga
vuṭṭibaḍi avi yorvaguṁḍavachchunā
paṭṭibudevula nenu pachchisedunā ninnu
diṭṭivu nīvinniyunum̐ dĕliyanivunnavā
(||tabaga||)
kaggusu nīradulagem̐kaḍado nuṁḍuḍa gāga
siggudoḍam̐ gŏṁkusu vaṁchiṁchavachchunā
yĕggula śhrīveṁkaḍeśha yĕravu sedunā ninnu
diggajama vinniyunum̐ dĕliyanivunnavā