తప్పక యేమి చూచేవు తగ నాదిక్కు
(॥పల్లవి॥)
తప్పక యేమి చూచేవు తగ నాదిక్కు
యెప్పుడును నీ వోజలేల మానే విపుడు
(॥తప్ప॥)
ఆకె నీవు నేక తాన నాడుకొన్నమాటలెల్లా
మాకుఁ జెప్పేవా నీవు మాపుదాఁకాను
మైకొని నాకాతరాన మఱచి నే నడిగితే
యీకడ నమరఁజెప్ప కేల మానే విపుడు
(॥తప్ప॥)
సిగ్గుదేరిరతివేళ జేసుకొన్న మీచేఁతలు
తగ్గి దాఁచుకొనక ఇంతటఁ జూపేవా
వెగ్గళించి తమకాన వెరవక సోదించితి
యెగ్గులేకొడఁబఱచ కేల మానే విపుడు
(॥తప్ప॥)
కలసినప్పటి మీలోఁగలిగిన వేడుకలు
నలిరేఁగి నేరిపేవా నన్నేలితివి
మెలఁగి శ్రీ వేంకటేశ మిక్కలి నిన్నొరసితీ
యెలమి సమ్మతిసేయ కేల మానే విపుడు
(||pallavi||)
tappaga yemi sūsevu taga nādikku
yĕppuḍunu nī vojalela māne vibuḍu
(||tappa||)
āgĕ nīvu nega tāna nāḍugŏnnamāḍalĕllā
māgum̐ jĕppevā nīvu mābudām̐kānu
maigŏni nāgādarāna maṟasi ne naḍigide
yīgaḍa namaram̐jĕppa kela māne vibuḍu
(||tappa||)
sigguderiradiveḽa jesugŏnna mīsem̐talu
taggi dām̐sugŏnaga iṁtaḍam̐ jūbevā
vĕggaḽiṁchi tamagāna vĕravaga sodiṁchidi
yĕggulegŏḍam̐baṟasa kela māne vibuḍu
(||tappa||)
kalasinappaḍi mīlom̐galigina veḍugalu
nalirem̐gi neribevā nannelidivi
mĕlam̐gi śhrī veṁkaḍeśha mikkali ninnŏrasidī
yĕlami sammadiseya kela māne vibuḍu