తప్పక చూడవయ్యా తలయెత్తి యీకె దిక్కు
(॥పల్లవి॥)
తప్పక చూడవయ్యా తలయెత్తి యీకె దిక్కు
వొప్పు లన్నియును నీ యువిదకే కలిగె
(॥తప్ప॥)
చక్కని చందమామ సతిమోము
చిక్కని తేటవెన్నెల చిరునవ్వు
జక్కవల సొబగులు చన్నులు
అక్కజపు సింగారము లతివకే కలిగె
(॥తప్ప॥)
గండుఁ దుమ్మిదల పిండు కలికి కొప్పు
పండుఁ బగడపు జోక పసనిమోవి
మెండైన నిగ్గుటద్దాల మించు జెక్కులు
దండిగల యందము లీ తరుణికిఁ గలిగె
(॥తప్ప॥)
గొప్ప తమ్మిరేకు లీ కొమ్మ కన్నులు
చెప్పరానిచిగురు లీ చిన్నిపాదాలు
యిప్పు డిట్టె శ్రీవేంకటేశ నిన్ను రతిఁగూడె
మెప్పించె నీవింత లలమేల్మంగకే కలిగె
(||pallavi||)
tappaga sūḍavayyā talayĕtti yīgĕ dikku
vŏppu lanniyunu nī yuvidage kaligĕ
(||tappa||)
sakkani saṁdamāma sadimomu
sikkani teḍavĕnnĕla sirunavvu
jakkavala sŏbagulu sannulu
akkajabu siṁgāramu ladivage kaligĕ
(||tappa||)
gaṁḍum̐ dummidala piṁḍu kaligi kŏppu
paṁḍum̐ bagaḍabu joga pasanimovi
mĕṁḍaina nigguḍaddāla miṁchu jĕkkulu
daṁḍigala yaṁdamu lī taruṇigim̐ galigĕ
(||tappa||)
gŏppa tammiregu lī kŏmma kannulu
sĕpparānisiguru lī sinnibādālu
yippu ḍiṭṭĕ śhrīveṁkaḍeśha ninnu radim̐gūḍĕ
mĕppiṁchĕ nīviṁta lalamelmaṁgage kaligĕ