Tappaga sepparaa vori daamsaga neevu

తప్పక చెప్పరా వోరి దాఁచక నీవు
Language

(॥పల్లవి॥)
తప్పక చెప్పరా వోరి దాఁచక నీవు
యెప్పుడు నీవద్దఁ గాక యెడసి వుండెనా

(॥తప్పక॥)
సందెకాడ రమ్మనఁగా జామువోయి వచ్చితివి
విందువలె నెవ్వతెకు వెచ్చ మైతివో
అందుకు వగవ నే నాపె నంటిన కౌఁగిలి
యిందుఁ గలుపే వంటా యింత లోఁగేను

(॥తప్పక॥)
పిలువనంపినచెలిఁ బెట్టు కూడితి విందాక
తలఁపు నీ కక్కడనే తమకించెనో
చలము నీతోఁ గాదు చవి దప్పినందుమీఁద
బలిమిఁ గలయఁబోతే పస లేవు పనులు

(॥తప్పక॥)
కప్పురమే యంపు మంటే గందవొడి యంపితివి
అప్పు డెక్కడికిఁ బరాకై వుండితివో
యిప్పుడు శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
నెప్పున నే కడమయినా నీకే సెలవూ

(||pallavi||)
tappaga sĕpparā vori dām̐saga nīvu
yĕppuḍu nīvaddam̐ gāga yĕḍasi vuṁḍĕnā

(||tappaga||)
saṁdĕgāḍa rammanam̐gā jāmuvoyi vachchidivi
viṁduvalĕ nĕvvadĕgu vĕchcha maidivo
aṁdugu vagava ne nābĕ naṁṭina kaum̐gili
yiṁdum̐ galube vaṁṭā yiṁta lom̐genu

(||tappaga||)
piluvanaṁpinasĕlim̐ bĕṭṭu kūḍidi viṁdāga
talam̐pu nī kakkaḍane tamagiṁchĕno
salamu nīdom̐ gādu savi dappinaṁdumīm̐da
balimim̐ galayam̐bode pasa levu panulu

(||tappaga||)
kappurame yaṁpu maṁṭe gaṁdavŏḍi yaṁpidivi
appu ḍĕkkaḍigim̐ barāgai vuṁḍidivo
yippuḍu śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
nĕppuna ne kaḍamayinā nīge sĕlavū