Tanuvum danuvu somke tamagamu daivaare

తనువుఁ దనువు సోఁకె తమకము దైవారె
Language

(॥పల్లవి॥)
తనువుఁ దనువు సోఁకె తమకము దైవారె
చెనకఁగా వద్దనఁగఁ జెల్లునటే ఇఁకను

(॥తను ॥)
పవ్వళించి యుండినపతి పాదా లొత్తుమనఁగాను
నవ్వులు నవ్వుదురటే నాలికత్తెవై
యెవ్వరుఁ జూడకుండాను ఇట్టె నేఁ దెరవేసేను
చివ్వన సిగ్గులువడఁ జెల్లునట్టే ఇఁకను

(॥తను॥)
ఆసపడి నిన్ను నిట్టె ఆకుమడిచిమ్మనఁగా
వేసాలు సేతురటవే వింతదానవై
వోసరించ కిటు మీకు నొడఁబడఁజెప్పే నేను
సేసవెట్టి తలవంచఁ జెల్లునటే ఇఁకను

(॥తను॥)
ముందె కాఁగిలించుకొని మోవితేనె ఇమ్మనఁగా
మందెమేల మౌదురటే మంకుదానవై
గొంది నలమేల్మంగవు కూడె శ్రీవేంకటేశుఁడు
చెందె మేలెల్లా జరయఁజెల్లునటే ఇఁకను

(||pallavi||)
tanuvum̐ danuvu som̐kĕ tamagamu daivārĕ
sĕnagam̐gā vaddanam̐gam̐ jĕllunaḍe im̐kanu

(||tanu ||)
pavvaḽiṁchi yuṁḍinabadi pādā lŏttumanam̐gānu
navvulu navvuduraḍe nāligattĕvai
yĕvvarum̐ jūḍaguṁḍānu iṭṭĕ nem̐ dĕravesenu
sivvana sigguluvaḍam̐ jĕllunaṭṭe im̐kanu

(||tanu||)
āsabaḍi ninnu niṭṭĕ āgumaḍisimmanam̐gā
vesālu seduraḍave viṁtadānavai
vosariṁcha kiḍu mīgu nŏḍam̐baḍam̐jĕppe nenu
sesavĕṭṭi talavaṁcham̐ jĕllunaḍe im̐kanu

(||tanu||)
muṁdĕ kām̐giliṁchugŏni movidenĕ immanam̐gā
maṁdĕmela mauduraḍe maṁkudānavai
gŏṁdi nalamelmaṁgavu kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
sĕṁdĕ melĕllā jarayam̐jĕllunaḍe im̐kanu