తనువిందుఁ దలఁపందు తమకము నడుమను
(॥పల్లవి॥)
తనువిందుఁ దలఁపందు తమకము నడుమను
పెనగొనీఁ దాను పిలిపించఁడొకొ అతఁడు
(॥॥)
ఇంతక పతికడకు నేఁగునొకొ చెలియ
వంతుల నిందు మరలి వచ్చునొకొ
చింతదీర నామాట చెప్పెనొకొ ఆడను
ఇంతితో మారుమాటలు యేమనెనొ అతఁడు
(॥॥)
రమ్మని పిలుచునొకొ రమణి యాతనిని
నెమ్మది మనవాకిట నిలుచునొకొ
తమ్మిరేకు లేకలైనాఁ దలఁపించకుండునొకొ
సమ్మతిఁ గరుణ నాపైఁ జల్లఁడొకొ యతఁడు
(॥॥)
వీఁడె విచ్చేసెననఁగా విందునొకొ నేను
పోఁడిమిఁగాఁగిట వానిఁ బొందుదునొకొ
నేఁడె శ్రీవేంకటపతి నే నలమేల్మంగనని
వాఁడె వచ్చి నన్నుఁగూడె వద్దనున్నాఁడతఁడు
(||pallavi||)
tanuviṁdum̐ dalam̐paṁdu tamagamu naḍumanu
pĕnagŏnīm̐ dānu pilibiṁcham̐ḍŏgŏ adam̐ḍu
(||||)
iṁtaga padigaḍagu nem̐gunŏgŏ sĕliya
vaṁtula niṁdu marali vachchunŏgŏ
siṁtadīra nāmāḍa sĕppĕnŏgŏ āḍanu
iṁtido mārumāḍalu yemanĕnŏ adam̐ḍu
(||||)
rammani pilusunŏgŏ ramaṇi yādanini
nĕmmadi manavāgiḍa nilusunŏgŏ
tammiregu legalainām̐ dalam̐piṁchaguṁḍunŏgŏ
sammadim̐ garuṇa nābaim̐ jallam̐ḍŏgŏ yadam̐ḍu
(||||)
vīm̐ḍĕ vichchesĕnanam̐gā viṁdunŏgŏ nenu
pom̐ḍimim̐gām̐giḍa vānim̐ bŏṁdudunŏgŏ
nem̐ḍĕ śhrīveṁkaḍabadi ne nalamelmaṁganani
vām̐ḍĕ vachchi nannum̐gūḍĕ vaddanunnām̐ḍadam̐ḍu