Tanum baasi voruvalem(nu?) damagamu naagu bettu

తనుఁ బాసి వోరువలేఁ(ను?) దమకము నాకు బెట్టు
Language

(॥పల్లవి॥)
తనుఁ బాసి వోరువలేఁ(ను?) దమకము నాకు బెట్టు
అనుమానించ వద్దు రమ్మనవే రమణుని

(॥తనుఁ॥)
పొలుపుగాఁ బెండ్లాడి పొంతనాలు చూడకేల
చెలరేఁగి తెరదీసి సిగ్గు మరేల
వలచి కాఁగిటఁ గూడి వాసులు వెదక నేల
అలుక లిఁకనేల రమ్మనవే రమణుని

(॥తను॥)
కోరి పొత్తునఁగుడిచి కుం మడుగఁగ నేలే
తారుకాణలైనమీఁద తగవులేలి
పేరఁబిల్చి పొందు సేసి బిగియ ప్పటి నేల
ఆరితేరెఁబనులు రమ్మనవే రమణుని

(॥తను॥)
చేక్కుల నొక్కి వేఁడుక చిమ్మన జంకెన లేల
మొక్కినచేతులఁజూప మోనాలేల
యిక్కడ శ్రీవేంకటేశుఁడే నల మేల్మంగను
అక్కరతో న న్నేలె రమ్మనలే రమణుని

(||pallavi||)
tanum̐ bāsi voruvalem̐(nu?) damagamu nāgu bĕṭṭu
anumāniṁcha vaddu rammanave ramaṇuni

(||tanum̐||)
pŏlubugām̐ bĕṁḍlāḍi pŏṁtanālu sūḍagela
sĕlarem̐gi tĕradīsi siggu marela
valasi kām̐giḍam̐ gūḍi vāsulu vĕdaga nela
aluga lim̐kanela rammanave ramaṇuni

(||tanu||)
kori pŏttunam̐guḍisi kuṁ maḍugam̐ga nele
tārugāṇalainamīm̐da tagavuleli
peram̐bilsi pŏṁdu sesi bigiya ppaḍi nela
āriderĕm̐banulu rammanave ramaṇuni

(||tanu||)
sekkula nŏkki vem̐ḍuga simmana jaṁkĕna lela
mŏkkinasedulam̐jūba monālela
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ḍe nala melmaṁganu
akkarado na nnelĕ rammanale ramaṇuni