Tanu nemi sesidine taa nela tamagimchene

తను నేమి సేసితినే తా నేల తమకించేనే
Language

(॥పల్లవి॥)
తను నేమి సేసితినే తా నేల తమకించేనే
యెనయఁగా నూరకున్న దిదే నా నేరమీ

(॥తను॥)
తగుల నాడినదదానఁ దల వంచు కుండ నైతి
నగితి నింతే పో నా నేరమీ
మొగుము చూచినదాన మోనము గైకొన నైతి
అగపడి లో నైన దదే నా నేరమీ

(॥తను॥)
యింటికి వచ్చినదాన నే మైనాఁ గొసర నైతి
నంటున నే నుంటి నది నా నేరమీ
అంటినదాన నే నట్టె చెనక నైతి
వొంటి మొగమోటల నే నున్నదే నా నేరమీ

(॥తను॥)
నెమ్మదిఁ గూడినదాన నిజబా సడుగ నైతి
నమ్మితి నే నిదయె కా నా నేరమీ
వుమ్మడి శ్రీవెంకటేశుఁ డొగి నిట్టె నన్నుఁ గూడె
సొమ్మల మై మఱచి నేఁ జొక్కినదే నేరమీ

(||pallavi||)
tanu nemi sesidine tā nela tamagiṁchene
yĕnayam̐gā nūragunna dide nā neramī

(||tanu||)
tagula nāḍinadadānam̐ dala vaṁchu kuṁḍa naidi
nagidi niṁte po nā neramī
mŏgumu sūsinadāna monamu gaigŏna naidi
agabaḍi lo naina dade nā neramī

(||tanu||)
yiṁṭigi vachchinadāna ne mainām̐ gŏsara naidi
naṁṭuna ne nuṁṭi nadi nā neramī
aṁṭinadāna ne naṭṭĕ sĕnaga naidi
vŏṁṭi mŏgamoḍala ne nunnade nā neramī

(||tanu||)
nĕmmadim̐ gūḍinadāna nijabā saḍuga naidi
nammidi ne nidayĕ kā nā neramī
vummaḍi śhrīvĕṁkaḍeśhum̐ ḍŏgi niṭṭĕ nannum̐ gūḍĕ
sŏmmala mai maṟasi nem̐ jŏkkinade neramī