తన్నుఁ దానే రమణుఁడు తగిలి మన్నించీఁ గాని
(॥పల్లవి॥)
తన్నుఁ దానే రమణుఁడు తగిలి మన్నించీఁ గాని
సన్నలా చాయలానే చల్లవే వలపులు
(॥తన్ను॥)
బలిమి సేయఁగవద్దు పతితోఁ బెనఁగవద్దు
మొలకనవ్వులు నవ్వి మోము చూపవే
చలము సాదించవద్దు సణఁగులు రాల్చవద్దు
తళుకుఁ జూపులఁ జూచి దండ నిలుచుండవే
(॥తన్ను॥)
పంతాలాడఁ గవద్దు పైకొని వాదించవద్దు
మంతనాన శిరసెత్తి మాఁటలాడవే
గంతులుసేయఁగ వద్దు రాఁగతనములు వద్దు
కొంత గొంత సిగ్గుతోడ గుట్టున మెలఁగవే
(॥తన్ను॥)
రవ్వలు సేయఁగవద్దు రచ్చలఁ బెట్టఁగ వద్దు
యివ్వలి మోమై చేతులెత్తి మొక్కవే
చివ్వన నన్నింతలోనె శ్రీవేంకటేశుఁడు గూడె
నివ్వటిల్ల మోవితేనే నీవు చలిచూపవే
(||pallavi||)
tannum̐ dāne ramaṇum̐ḍu tagili manniṁchīm̐ gāni
sannalā sāyalāne sallave valabulu
(||tannu||)
balimi seyam̐gavaddu padidom̐ bĕnam̐gavaddu
mŏlaganavvulu navvi momu sūbave
salamu sādiṁchavaddu saṇam̐gulu rālsavaddu
taḽugum̐ jūbulam̐ jūsi daṁḍa nilusuṁḍave
(||tannu||)
paṁtālāḍam̐ gavaddu paigŏni vādiṁchavaddu
maṁtanāna śhirasĕtti mām̐ṭalāḍave
gaṁtuluseyam̐ga vaddu rām̐gadanamulu vaddu
kŏṁta gŏṁta siggudoḍa guṭṭuna mĕlam̐gave
(||tannu||)
ravvalu seyam̐gavaddu rachchalam̐ bĕṭṭam̐ga vaddu
yivvali momai sedulĕtti mŏkkave
sivvana nanniṁtalonĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
nivvaḍilla movidene nīvu salisūbave