Tannum baasi vumdalenu taa nannu viduvalemdu

తన్నుఁ బాసి వుండలేను తా నన్ను విడువలేఁడు
Language

(॥పల్లవి॥)
తన్నుఁ బాసి వుండలేను తా నన్ను విడువలేఁడు
యిన్నియు నిందులో నున్న వెడ తాఁకనేలే

(॥తన్ను॥)
మాయలు నేఁజేయనేర మతకాలు నేనేర
చేయిచేత నూడిగాలు సేయనేరుతు
చాయల నాడవలదు సణఁగు లంత వలదు
సాయము దనకిచ్చితి పలుక లింకేలే

(॥తన్ను॥)
చలము సాదించఁ జాల జంకించ నేఁ జాల
పిలిచితే దగ్గరేటి ప్రియమే కాని
ములుగుచు నుండనోప ముంగోపాన కంత వోప
తలఁపెల్లఁ దనసొమ్మే తారుకాణ లేలే

(॥తన్ను॥)
నమ్మికడుగ వెరతు నాటకాలకు వెరతు
యిమ్ములఁ దనకు నే మోహించితి నిదే
అమ్మరో శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నేను
సమ్మతించి నన్నుఁ గూడె సారెఁ జెప్పనేలే

(||pallavi||)
tannum̐ bāsi vuṁḍalenu tā nannu viḍuvalem̐ḍu
yinniyu niṁdulo nunna vĕḍa tām̐kanele

(||tannu||)
māyalu nem̐jeyanera madagālu nenera
seyiseda nūḍigālu seyanerudu
sāyala nāḍavaladu saṇam̐gu laṁta valadu
sāyamu danagichchidi paluga liṁkele

(||tannu||)
salamu sādiṁcham̐ jāla jaṁkiṁcha nem̐ jāla
piliside daggareḍi priyame kāni
mulugusu nuṁḍanoba muṁgobāna kaṁta voba
talam̐pĕllam̐ danasŏmme tārugāṇa lele

(||tannu||)
nammigaḍuga vĕradu nāḍagālagu vĕradu
yimmulam̐ danagu ne mohiṁchidi nide
ammaro śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
sammadiṁchi nannum̐ gūḍĕ sārĕm̐ jĕppanele