Tannum baasi ne netlaa dariyimtu nanave

తన్నుఁ బాసి నే నెట్లా దరియింతు ననవే
Language

(॥పల్లవి॥)
తన్నుఁ బాసి నే నెట్లా దరియింతు ననవే
విన్నవించా రాదు విన్నవించకుండా రాదే

(॥॥)
మాటలఁ దన్ను నొడివి మరికొంత పొద్దు వుత్తు
కూటములు దలఁచుక కొంత పొద్దు వుత్తునే
పాటలు వాడుకొంటా నప్పటిఁ గొంతపొద్దు వుత్తు
పూఁట పూఁట కేమిటాను పొద్దు వోదే చెలియ

(॥॥)
యెదురు చూచి చూచి యిట్టే కొంత పొద్దువుత్తు
కుదురై అడియాసలఁ గొంత పొద్దు వుత్తునే
వెదకుతా నింటిలోన వెసఁ గొంత పొద్దు వుత్తు
పొదలుతా నేమిటానుఁ బొద్దు వోదే చెలియ

(॥॥)
అంచెల లేక లంప అట్టే కొంత పొద్దు వుత్తు
కొంచక వినుకలినే కొంతపొద్దు వుత్తునే
యెంచఁగ శ్రీ వేంకటేశుఁడిట్టే విచ్చేసి నన్నేలె
పొంచి తనియ కేమిటాఁ బొద్దు వోదే చెలియ

(||pallavi||)
tannum̐ bāsi ne nĕṭlā dariyiṁtu nanave
vinnaviṁchā rādu vinnaviṁchaguṁḍā rāde

(||||)
māḍalam̐ dannu nŏḍivi marigŏṁta pŏddu vuttu
kūḍamulu dalam̐suga kŏṁta pŏddu vuttune
pāḍalu vāḍugŏṁṭā nappaḍim̐ gŏṁtabŏddu vuttu
pūm̐ṭa pūm̐ṭa kemiḍānu pŏddu vode sĕliya

(||||)
yĕduru sūsi sūsi yiṭṭe kŏṁta pŏdduvuttu
kudurai aḍiyāsalam̐ gŏṁta pŏddu vuttune
vĕdagudā niṁṭilona vĕsam̐ gŏṁta pŏddu vuttu
pŏdaludā nemiḍānum̐ bŏddu vode sĕliya

(||||)
aṁchĕla lega laṁpa aṭṭe kŏṁta pŏddu vuttu
kŏṁchaga vinugaline kŏṁtabŏddu vuttune
yĕṁcham̐ga śhrī veṁkaḍeśhum̐ḍiṭṭe vichchesi nannelĕ
pŏṁchi taniya kemiḍām̐ bŏddu vode sĕliya