తనియదు నా మనసు తమితో నీ పొందుసేసి
(॥పల్లవి॥)
తనియదు నా మనసు తమితో నీ పొందుసేసి
యెనసిన వేళ గుణ మెట్టిదోకాని
(॥తని॥)
చేసన్న సేసినప్పడే చేరే నాకోరిక లెల్లా
పాసి వుండలేక కొంగు వట్టుదుఁగాని
వేసిన పూవులచెండు వెస మర్మములు రేఁచె
బేసబెల్లితనమునఁ బెనఁగుదుఁగాని
(॥తని॥)
వీడె మిచ్చినప్పడే వెలసె నీమన్ననలు
వేడుకకు నీపై నోలవేతుఁగాని
వాడిక నీమాటలే వడి నన్ను నమ్మించె
జోడుగూడి యప్పటిని సొలతుఁగాని
(॥తని॥)
తెరదీసినప్పడే దిష్టమాయ సోబనము
సరుగ నూరకే సేస చల్లేఁగాని
యిరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
సరిమోవిచ్చితి రింకాఁ జవిగొనేఁగాని
(||pallavi||)
taniyadu nā manasu tamido nī pŏṁdusesi
yĕnasina veḽa guṇa mĕṭṭidogāni
(||tani||)
sesanna sesinappaḍe sere nāgoriga lĕllā
pāsi vuṁḍalega kŏṁgu vaṭṭudum̐gāni
vesina pūvulasĕṁḍu vĕsa marmamulu rem̐sĕ
besabĕllidanamunam̐ bĕnam̐gudum̐gāni
(||tani||)
vīḍĕ michchinappaḍe vĕlasĕ nīmannanalu
veḍugagu nībai nolavedum̐gāni
vāḍiga nīmāḍale vaḍi nannu nammiṁchĕ
joḍugūḍi yappaḍini sŏladum̐gāni
(||tani||)
tĕradīsinappaḍe diṣhṭamāya sobanamu
saruga nūrage sesa sallem̐gāni
yiravai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
sarimovichchidi riṁkām̐ javigŏnem̐gāni