Taniya demtainaanum damagame pemchunu

తనియ దెంతైనానుఁ దమకమే పెంచును
Language

(॥పల్లవి॥)
తనియ దెంతైనానుఁ దమకమే పెంచును
వనితకు నేయివంటి వలపో యితనిపై

(॥తనియ॥)
కౌఁగిలించువిభునికిఁగప్పురవీడెమిచ్చు
మాఁగినమోవియానుమాటలాడును
ఱాఁగి రేఁగి గోర నూఁదు రతికిఁ బిలుచు విఱ్ఱ
వీఁగుచుఁ బైనొరగు వెలఁది యాతనిపై

(॥తనియ॥)
కన్నులఁ దప్పక చూచుఁ గందువ తిట్లు దిట్టు
కిన్నెరగుబ్బల నూఁదు గిలిగించును
చిన్నిచేయి మీఁద వేసు చెక్కు గదియించు
పన్ని నిమ్మపంట వేసుఁ బకపక నగును

(॥తనియ॥)
కదియుచు కొప్పు దువ్వు కమ్మటి సరసమాడు
తుదచేఁ తడుగు నదే దొమ్మి సేసును
యెదుట శ్రీవేంకటేశు నిటువలెఁ గూడె నింతి
మదిలో కోరికె యెంతో మగువే యెఱుఁగును

(||pallavi||)
taniya dĕṁtainānum̐ damagame pĕṁchunu
vanidagu neyivaṁṭi valabo yidanibai

(||taniya||)
kaum̐giliṁchuvibhunigim̐gappuravīḍĕmichchu
mām̐ginamoviyānumāḍalāḍunu
ṟām̐gi rem̐gi gora nūm̐du radigim̐ bilusu viṭra
vīm̐gusum̐ bainŏragu vĕlam̐di yādanibai

(||taniya||)
kannulam̐ dappaga sūsum̐ gaṁduva tiṭlu diṭṭu
kinnĕragubbala nūm̐du giligiṁchunu
sinniseyi mīm̐da vesu sĕkku gadiyiṁchu
panni nimmabaṁṭa vesum̐ bagabaga nagunu

(||taniya||)
kadiyusu kŏppu duvvu kammaḍi sarasamāḍu
tudasem̐ taḍugu nade dŏmmi sesunu
yĕduḍa śhrīveṁkaḍeśhu niḍuvalĕm̐ gūḍĕ niṁti
madilo korigĕ yĕṁto maguve yĕṟum̐gunu