Tanivi lega seemkadi davvee dehi

తనివి లేక చీఁకటి దవ్వీ దేహి
Language

(॥పల్లవి॥)
తనివి లేక చీఁకటి దవ్వీ దేహి
ఘనుఁడై హరిఁ గొల్చితే కైకొని రక్షించఁడా

(॥తనివి॥)
అంది రసవాదమున కాసపడేటి మనసు
గొంది బిలములు చొచ్చి కూడపెట్టేటి మనసు
సందించి మంత్రవాదాన సాదించేటి మనసు
యిందిరేశుపైఁ బెట్టితే నిన్నియు నొసఁగఁడా

(॥తనివి॥)
నెట్టన నంజనగాఁడై నేల దవ్వించే మనసు
అట్టే కాయసిద్ధికిఁగా నాసపడేటి మనసు
పట్టి సిద్ధమూలికలవసఁ జిక్కేటి మనసు
దిట్టయై కృష్ణుని మీఁదఁ బెట్టితే మన్నించఁడా

(॥తనివి॥)
చేరి యక్షిణుల పంపు సేయించుకొనే మనసు
ఆరయ రాక్షసమాయ నభ్యసించేటి మనసు
యీరీతి శ్రీవేంకటేశు హృదయములోఁ దలఁచి
పేరుకొని నుతించితే పెంపున నీడేర్ఛఁడా

(||pallavi||)
tanivi lega sīm̐kaḍi davvī dehi
ghanum̐ḍai harim̐ gŏlside kaigŏni rakṣhiṁcham̐ḍā

(||tanivi||)
aṁdi rasavādamuna kāsabaḍeḍi manasu
gŏṁdi bilamulu sŏchchi kūḍabĕṭṭeḍi manasu
saṁdiṁchi maṁtravādāna sādiṁcheḍi manasu
yiṁdireśhubaim̐ bĕṭṭide ninniyu nŏsam̐gam̐ḍā

(||tanivi||)
nĕṭṭana naṁjanagām̐ḍai nela davviṁche manasu
aṭṭe kāyasiddhigim̐gā nāsabaḍeḍi manasu
paṭṭi siddhamūligalavasam̐ jikkeḍi manasu
diṭṭayai kṛṣhṇuni mīm̐dam̐ bĕṭṭide manniṁcham̐ḍā

(||tanivi||)
seri yakṣhiṇula paṁpu seyiṁchugŏne manasu
āraya rākṣhasamāya nabhyasiṁcheḍi manasu
yīrīdi śhrīveṁkaḍeśhu hṛdayamulom̐ dalam̐si
perugŏni nudiṁchide pĕṁpuna nīḍersham̐ḍā