తనివి లేదు నాకైతేఁ దమకము దీరదు
(॥పల్లవి॥)
తనివి లేదు నాకైతేఁ దమకము దీరదు
తనకుఁ గానే మతిఁ దలపోసెనే
(॥॥)
కడు సంతోసానఁ దన్నుఁ గౌఁగిలించుకొనే నంటే
యెడలేని నా చన్ను లెంత వొత్తునో
జడియక తనతో నే సారె మాటలాడే నంటే
అడ రెప్పు డెంతలవా టవునో తనకూ
(॥॥)
చక్కని తన మొగము సారెఁ జూచే నంటే
యిక్కువైన నా చూపు లెంత నాఁటునో
తక్కక రతులఁ గూడి తన్ను మెప్పించే నంటే
నెక్కొన్న మనసెంత నీరుగాఁ గరఁగునో
(॥॥)
తగఁ దన కధరామృతము చవి చుపే నంటే
చిగురు మోవి యాడఁ జిల్లులవునో
అగపడి శ్రీ వేంకటాధిపతి నన్నుఁగూడె
అగడుగాఁ దన కెన్నియాసలు రేఁగునో
(||pallavi||)
tanivi ledu nāgaidem̐ damagamu dīradu
tanagum̐ gāne madim̐ dalabosĕne
(||||)
kaḍu saṁtosānam̐ dannum̐ gaum̐giliṁchugŏne naṁṭe
yĕḍaleni nā sannu lĕṁta vŏttuno
jaḍiyaga tanado ne sārĕ māḍalāḍe naṁṭe
aḍa rĕppu ḍĕṁtalavā ṭavuno tanagū
(||||)
sakkani tana mŏgamu sārĕm̐ jūse naṁṭe
yikkuvaina nā sūbu lĕṁta nām̐ṭuno
takkaga radulam̐ gūḍi tannu mĕppiṁche naṁṭe
nĕkkŏnna manasĕṁta nīrugām̐ garam̐guno
(||||)
tagam̐ dana kadharāmṛtamu savi sube naṁṭe
siguru movi yāḍam̐ jillulavuno
agabaḍi śhrī veṁkaḍādhibadi nannum̐gūḍĕ
agaḍugām̐ dana kĕnniyāsalu rem̐guno