Tanisinavaamdu gaana tami saaladu danagu

తనిసినవాఁడు గాన తమి చాలదు దనకు
Language

(॥పల్లవి॥)
తనిసినవాఁడు గాన తమి చాలదు దనకు
పని లేదు తను నింక బడలించ నాకు

(॥తనిసిన॥)
సరసమే ఘన మాయ సరి యేఁకలవల పాయ
సరివొద్దు వోయ నింకాఁ జాల దటరే
అరలోనఁ బవ్వళించు మనరే విభుని నేను
పొరిఁ దూఁగుమంచానఁ బొరలేఁ గాని

(॥తనిసిన॥)
పందెములే తఱ చాయ బయలీఁత సుద్దు లాయ
చందమామగుటుకలు చాల దటరే
కందువ నిద్ర రా కుంటె కతలు విను మనరే
ముందర నేనే లోన మొక్కు చుండేఁ గాని

(॥తనిసిన॥)
చల్లుఁజూపు లెక్కు డాయ జడివానరతు లాయ
జల్లింపు వినయములు చాల దటరే
యిల్లిదె శ్రీవెంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూఁడె
యెల్లకాలమునుఁ దన్ను నెడ వాయఁ గాని

(||pallavi||)
tanisinavām̐ḍu gāna tami sāladu danagu
pani ledu tanu niṁka baḍaliṁcha nāgu

(||tanisina||)
sarasame ghana māya sari yem̐kalavala pāya
sarivŏddu voya niṁkām̐ jāla daḍare
aralonam̐ bavvaḽiṁchu manare vibhuni nenu
pŏrim̐ dūm̐gumaṁchānam̐ bŏralem̐ gāni

(||tanisina||)
paṁdĕmule taṟa sāya bayalīm̐ta suddu lāya
saṁdamāmaguḍugalu sāla daḍare
kaṁduva nidra rā kuṁṭĕ kadalu vinu manare
muṁdara nene lona mŏkku suṁḍem̐ gāni

(||tanisina||)
sallum̐jūbu lĕkku ḍāya jaḍivānaradu lāya
jalliṁpu vinayamulu sāla daḍare
yillidĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁta sesi nannum̐ gūm̐ḍĕ
yĕllagālamunum̐ dannu nĕḍa vāyam̐ gāni