Tanisidi numdaneeve tana valasinayattu

తనిసితి నుండనీవే తన వలసినయట్టు
Language

(॥పల్లవి॥)
తనిసితి నుండనీవే తన వలసినయట్టు
చినుకులేని చిత్తడి సిగ్గులేలే ఇఁకను

(॥॥)
ఆడినదే మాటా ఆతఁడే యెరుఁగును
యేడలేనిబుద్దులు మీ రేమి చెప్పేరే
గోడలేనిచిత్తరువు కొలచీ నందే కొలపు
తాడు లేని కట్టు వట్టి తగులేలే యిఁకను

(॥॥)
తుద నేమనీనె దూరులెల్లా వచ్చె
పదమనవే యింకఁ బనిలేదు
యెదురులేనిమాట కదురువలెనే వుండు
పెదవి పై తేనెల ప్రియమేలే యిఁకను

(॥॥)
యింటికిఁ దా వచ్చినదే యిన్నిటికీ గురియాయ
జంటలయెడమాటలు చాలుఁజాలునే
అంటిముట్టి శ్రీ వేంకటాద్రీశుఁ డిదె కూడి
వెంట వెంటఁ దిరిగీని వెర పేలే యిఁకను

(||pallavi||)
tanisidi nuṁḍanīve tana valasinayaṭṭu
sinuguleni sittaḍi siggulele im̐kanu

(||||)
āḍinade māḍā ādam̐ḍe yĕrum̐gunu
yeḍalenibuddulu mī remi sĕppere
goḍalenisittaruvu kŏlasī naṁde kŏlabu
tāḍu leni kaṭṭu vaṭṭi tagulele yim̐kanu

(||||)
tuda nemanīnĕ dūrulĕllā vachchĕ
padamanave yiṁkam̐ baniledu
yĕdurulenimāḍa kaduruvalĕne vuṁḍu
pĕdavi pai tenĕla priyamele yim̐kanu

(||||)
yiṁṭigim̐ dā vachchinade yinniḍigī guriyāya
jaṁṭalayĕḍamāḍalu sālum̐jālune
aṁṭimuṭṭi śhrī veṁkaḍādrīśhum̐ ḍidĕ kūḍi
vĕṁṭa vĕṁṭam̐ dirigīni vĕra pele yim̐kanu