(॥పల్లవి॥)
తనిసితి నిఁకఁ దలఁగరే
కనుఁగొనచూపు కానరాదా
(॥తనిసి॥)
చాలుఁజాలు మాటలు చాలించరే
యేలే వొడఁబా ట్లింకానా
నాలుక తుదలే నయములు తన
యీలకూర కుప్పులింతే లే
(॥తనిసి॥)
ఆయె నాయెఁ బను లల్ల నాఁడేనే
రాయడిఁ దనకే రవ్వయితిని
పోయినదే పొల్లు పోని రేవడ
మాయల నొప్పికి మందే లేదు
(॥తనిసి॥)
చెల్లెఁ జెల్లెఁ దనసేఁత లెల్లానేఁ
డిల్లిటే శ్రీవేంకటేశ్వరుఁడు
బల్లిదుఁడై కూడెఁబంతమునా తన
చల్లువలపులే చవులు గావా
(||pallavi||)
tanisidi nim̐kam̐ dalam̐gare
kanum̐gŏnasūbu kānarādā
(||tanisi||)
sālum̐jālu māḍalu sāliṁchare
yele vŏḍam̐bā ṭliṁkānā
nāluga tudale nayamulu tana
yīlagūra kuppuliṁte le
(||tanisi||)
āyĕ nāyĕm̐ banu lalla nām̐ḍene
rāyaḍim̐ danage ravvayidini
poyinade pŏllu poni revaḍa
māyala nŏppigi maṁde ledu
(||tanisi||)
sĕllĕm̐ jĕllĕm̐ danasem̐ta lĕllānem̐
ḍilliḍe śhrīveṁkaḍeśhvarum̐ḍu
ballidum̐ḍai kūḍĕm̐baṁtamunā tana
salluvalabule savulu gāvā