తనిసితి నన్నిటాను తాలిమే మేలిమాయ
(॥పల్లవి॥)
తనిసితి నన్నిటాను తాలిమే మేలిమాయ
యెనసిన సంతసము లిఁక నెన్నఁడే
(॥తని॥)
ఆసలనే కొంతవొద్దు అంగమంటి కొంతవొద్దు
బాసచేసి కొంతవొద్దు భ్రమయించెను
వాసికి సరసమాడ వయసు వోయీనేమో
యీసుదీర మన్నించే దిఁక నెన్నఁడే
(॥తని॥)
మోము చూపి కొంతవొద్దు మొక్కులాడి కొంతవొద్దు
నాముదేద నవ్వి కొంత నాలిసేసెను
ఆమనిఁ గుంటెనమాఁట లాడఁగానే తెల్లవారె
యీమేర నన్నుఁ గూడె దిఁక నెన్నఁడే
(॥తని॥)
చేయివేసి కొంతవొద్దు సేసవెట్టి కొంతవొద్దు
యీయెడఁ గాఁగిటఁ గూడె నీపొద్దు
పాయపుశ్రీవేంకటాద్రిపతి కింతా సెలవాయ
యేయెడఁ జొక్కుదుఁగాక యిఁక నెన్నఁడే
(||pallavi||)
tanisidi nanniḍānu tālime melimāya
yĕnasina saṁtasamu lim̐ka nĕnnam̐ḍe
(||tani||)
āsalane kŏṁtavŏddu aṁgamaṁṭi kŏṁtavŏddu
bāsasesi kŏṁtavŏddu bhramayiṁchĕnu
vāsigi sarasamāḍa vayasu voyīnemo
yīsudīra manniṁche dim̐ka nĕnnam̐ḍe
(||tani||)
momu sūbi kŏṁtavŏddu mŏkkulāḍi kŏṁtavŏddu
nāmudeda navvi kŏṁta nālisesĕnu
āmanim̐ guṁṭĕnamām̐ṭa lāḍam̐gāne tĕllavārĕ
yīmera nannum̐ gūḍĕ dim̐ka nĕnnam̐ḍe
(||tani||)
seyivesi kŏṁtavŏddu sesavĕṭṭi kŏṁtavŏddu
yīyĕḍam̐ gām̐giḍam̐ gūḍĕ nībŏddu
pāyabuśhrīveṁkaḍādribadi kiṁtā sĕlavāya
yeyĕḍam̐ jŏkkudum̐gāga yim̐ka nĕnnam̐ḍe