Tanisidi minnidaanu davvula neemeluseda

తనిసితి మిన్నిటాను దవ్వుల నీమేలుచేత
Language

(॥పల్లవి॥)
తనిసితి మిన్నిటాను దవ్వుల నీమేలుచేత
వెనకటివలెనే కా విడవయ్య చాలును

(॥తని॥)
చెక్కులలో నొక్కుల చేతులపై మొక్కుల
మక్కువ నీవు సేసేటిమంచితనాలు
యెక్కడ నుంటి విందాఁక నేమి సేసి వచ్చితివి
లెక్కలేవు నీప్రియలు లేవయ్య చాలును

(॥తని॥)
కప్పురపు వీడేలు గబ్బిచూపుమేడేలు
యెప్పుడూఁ గలవే నీయింటికాఁడను
కొప్పు నీ కేల జారెను కొంగు యెవ్వరు వట్టిరి
వొప్పు గొంటి నీమాటలు వుండవయ్య చాలును

(॥తని॥)
కాఁగిటిలో సాములూ కడునవ్వులవాములు
చేఁగదేర నీవు నేరిచినవే తొల్లి
యేఁగి వచ్చి శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
ఆఁగితి నీ వన్నట్టే అవునయ్య చాలును

(||pallavi||)
tanisidi minniḍānu davvula nīmeluseda
vĕnagaḍivalĕne kā viḍavayya sālunu

(||tani||)
sĕkkulalo nŏkkula sedulabai mŏkkula
makkuva nīvu seseḍimaṁchidanālu
yĕkkaḍa nuṁṭi viṁdām̐ka nemi sesi vachchidivi
lĕkkalevu nīpriyalu levayya sālunu

(||tani||)
kappurabu vīḍelu gabbisūbumeḍelu
yĕppuḍūm̐ galave nīyiṁṭigām̐ḍanu
kŏppu nī kela jārĕnu kŏṁgu yĕvvaru vaṭṭiri
vŏppu gŏṁṭi nīmāḍalu vuṁḍavayya sālunu

(||tani||)
kām̐giḍilo sāmulū kaḍunavvulavāmulu
sem̐gadera nīvu nerisinave tŏlli
yem̐gi vachchi śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
ām̐gidi nī vannaṭṭe avunayya sālunu