Tanisidi mimka mamum dadavaguraa

తనిసితి మిఁక మముఁ దడవకురా
Language

(॥పల్లవి॥)
తనిసితి మిఁక మముఁ దడవకురా
చనవుకు మనవికి సరికి సరి

(॥తని॥)
నలుగడ నీవిటు నవ్విననవ్వులు
అలిగినవేళకు నవి సరియే
వలపులు చల్లేవు వాదుకు వచ్చేవు
చలువకు వేఁడికి సరికిసరి

(॥తని॥)
వరుస నాకిచ్చితి వద్దికి వచ్చిన
సరవులఁ బెట్టిన సరికిసరి
మరిగినాఁ బోనీవు మాటలు నాడవు
సరసము విరసము సరికిసరి

(॥తని॥)
తమకంబున మనతనువు లిద్దరికి
సమరతి వుపరతి సరికిసరి
అమరిన శ్రీవేంకటాధిప యిటు మన-
సముకపుమఱపులు సరికిసరి

(||pallavi||)
tanisidi mim̐ka mamum̐ daḍavagurā
sanavugu manavigi sarigi sari

(||tani||)
nalugaḍa nīviḍu navvinanavvulu
aliginaveḽagu navi sariye
valabulu sallevu vādugu vachchevu
saluvagu vem̐ḍigi sarigisari

(||tani||)
varusa nāgichchidi vaddigi vachchina
saravulam̐ bĕṭṭina sarigisari
mariginām̐ bonīvu māḍalu nāḍavu
sarasamu virasamu sarigisari

(||tani||)
tamagaṁbuna manadanuvu liddarigi
samaradi vubaradi sarigisari
amarina śhrīveṁkaḍādhiba yiḍu mana-
samugabumaṟabulu sarigisari