Tanisidi mannidaanum dalavayyaa

తనిసితి మన్నిటానుఁ దలవయ్యా
Language

(॥పల్లవి॥)
తనిసితి మన్నిటానుఁ దలవయ్యా
కనుసన్నలెల్లఁ గంటిఁ గానీవయ్యా

(॥తని॥)
పిలువా నేరుతువు బిగియా నేరుతువు
పలికినపాటే చాలుఁ బట్టకువయ్య
చలమొ పలమొ చనవిమనవు లింకఁ
గలిగినపాటే చాలుఁ గానీవయ్యా

(॥తని॥)
కరఁగించ నేరుతువు కాకుసేయ నేరుతువు
వరుస నాఁడే చాలు వద్దువద్దయ్య
సరసమో విరసమా సారెసారె వినయాలు
యిరవైనపాటే చాలు యింతేలయ్యా

(॥తని॥)
తత్తరించ నేరుతువు తరితీవు నేరుతువు
బత్తిగలంతే చాలు బాసలేలయ్యా
అత్తి శ్రీ వేంకటపతి ఆదరించి కూడితివి
పొత్తు నత్తుఁ గూడె నింక బూటకమేలయ్యా

(||pallavi||)
tanisidi manniḍānum̐ dalavayyā
kanusannalĕllam̐ gaṁṭim̐ gānīvayyā

(||tani||)
piluvā neruduvu bigiyā neruduvu
paliginabāḍe sālum̐ baṭṭaguvayya
salamŏ palamŏ sanavimanavu liṁkam̐
galiginabāḍe sālum̐ gānīvayyā

(||tani||)
karam̐giṁcha neruduvu kāguseya neruduvu
varusa nām̐ḍe sālu vadduvaddayya
sarasamo virasamā sārĕsārĕ vinayālu
yiravainabāḍe sālu yiṁtelayyā

(||tani||)
tattariṁcha neruduvu taridīvu neruduvu
battigalaṁte sālu bāsalelayyā
atti śhrī veṁkaḍabadi ādariṁchi kūḍidivi
pŏttu nattum̐ gūḍĕ niṁka būḍagamelayyā