Tanavalene soosee tarunulanu

తనవలెనే చూచీ తరుణులను
Language

(॥పల్లవి॥)
తనవలెనే చూచీ తరుణులను
ఘనులు మానాపతులఁ గాకు సేయవలెనా

(॥తన॥)
సిగ్గుతో నేనుండఁగాను చింతతోనుందాననంటా
వొగ్గి నన్నేలాడీనే వొక్కటొక్కటే
అగ్గమైన ఆడువారు అణఁకువతోనుండఁగాఁ
నెగ్గులెంచేమగవాఁడు యేడనైనాఁ గలఁడా

(॥తన॥)
అవ్వలిమోమైన దానినలిగి వుందాననంటా
రవ్వలుగనాడుకొనీ రచ్చలోను
పువ్వువంటి మగనాలు పొంచి గుట్టుననుండఁగ
మవ్వపుఁగోపము చూపేమంకువాఁడు గలఁడా

(॥తన॥)
దండ నే నిలుచుండఁగా తన్ను నేఁ బిలిచేనంటా
బెండుపడ నాతోనేల పెనఁగీనే
వెండియు శ్రీవేంకటాద్రి విభుఁడిట్టె నన్నుఁ గూడె
దండితోడనిటువంటి తత్తరీఁడు గలఁడా

(||pallavi||)
tanavalĕne sūsī taruṇulanu
ghanulu mānābadulam̐ gāgu seyavalĕnā

(||tana||)
siggudo nenuṁḍam̐gānu siṁtadonuṁdānanaṁṭā
vŏggi nannelāḍīne vŏkkaḍŏkkaḍe
aggamaina āḍuvāru aṇam̐kuvadonuṁḍam̐gām̐
nĕggulĕṁchemagavām̐ḍu yeḍanainām̐ galam̐ḍā

(||tana||)
avvalimomaina dāninaligi vuṁdānanaṁṭā
ravvaluganāḍugŏnī rachchalonu
puvvuvaṁṭi maganālu pŏṁchi guṭṭunanuṁḍam̐ga
mavvabum̐gobamu sūbemaṁkuvām̐ḍu galam̐ḍā

(||tana||)
daṁḍa ne nilusuṁḍam̐gā tannu nem̐ bilisenaṁṭā
bĕṁḍubaḍa nādonela pĕnam̐gīne
vĕṁḍiyu śhrīveṁkaḍādri vibhum̐ḍiṭṭĕ nannum̐ gūḍĕ
daṁḍidoḍaniḍuvaṁṭi tattarīm̐ḍu galam̐ḍā