తనవారని యాసఁ దగిలి భ్రమయనేల
(॥పల్లవి॥)
తనవారని యాసఁ దగిలి భ్రమయనేల
తనువుఁ బ్రాణునికంటె తగులేది
(॥తన॥)
తనువుఁ బ్రాణుడు రెండు తగిలి గర్భమునందు
వొనర నేకమై యుదయించి
దినములు చెల్లిన తివిరి యాప్రాణుఁడు
తనువువిడిచిపోయ దయలేక
(॥తన॥)
ప్రాణికై దేహము పాపపుణ్యముసేయు
ప్రాణి వెంటనె బొంది పాశుండదు
ప్రాణి యచ్చటనైన బాధలఁ బడకుండ
ప్రాణి రక్షించు బొందిబడి దాఁ బోయనా
(॥తన॥)
యెరవుల దేహలివి నిజమని నమ్మి
యెరిఁగీనెఱుఁగలే రిది యాలా
అరయఁ బరమునకు నాది పురుషుఁడై
పరగుశ్రీ వేంకటపతి గలిగుండఁగా
(||pallavi||)
tanavārani yāsam̐ dagili bhramayanela
tanuvum̐ brāṇunigaṁṭĕ taguledi
(||tana||)
tanuvum̐ brāṇuḍu rĕṁḍu tagili garbhamunaṁdu
vŏnara negamai yudayiṁchi
dinamulu sĕllina tiviri yāprāṇum̐ḍu
tanuvuviḍisiboya dayalega
(||tana||)
prāṇigai dehamu pābabuṇyamuseyu
prāṇi vĕṁṭanĕ bŏṁdi pāśhuṁḍadu
prāṇi yachchaḍanaina bādhalam̐ baḍaguṁḍa
prāṇi rakṣhiṁchu bŏṁdibaḍi dām̐ boyanā
(||tana||)
yĕravula dehalivi nijamani nammi
yĕrim̐gīnĕṟum̐gale ridi yālā
arayam̐ baramunagu nādi puruṣhum̐ḍai
paraguśhrī veṁkaḍabadi galiguṁḍam̐gā