తనవార లెంతైనా తనకుఁ బగటరే
(॥పల్లవి॥)
తనవార లెంతైనా తనకుఁ బగటరే
మనసులోని మరుఁడు మగువకే తోడు
(॥తన॥)
కలువల చెలికాని కాంతలు దూరకురే
కలువల చెలికాఁడే కాంతకు మోము
చలిగాలి నూరకైనా సారె జరయకురే
చలిగాలి యీ యింతి చల్లని నిటూర్పు
(॥తన॥)
తెగి తుమ్మెదల నేల తిట్టకురే సతులు
పగటుఁ దుమ్మెద లింతిపాపటికొప్పు
మిగులఁ జిలుకలను మెఱసి కోపించకురే
పగవు చిలుకకూఁతే పడఁతి పలుకులు
(॥తన॥)
వెన్నెలలపై నంత వేసరకురే విూరు
వెన్నెలలు యిన్నయును వెలఁదినవ్వు
యిన్నిటాను శ్రీవేంకటేశుఁడు యీ కాంతఁ గూడె
పన్ని యీతఁడే యింతి ప్రాణబందుగుఁడు
(||pallavi||)
tanavāra lĕṁtainā tanagum̐ bagaḍare
manasuloni marum̐ḍu maguvage toḍu
(||tana||)
kaluvala sĕligāni kāṁtalu dūragure
kaluvala sĕligām̐ḍe kāṁtagu momu
saligāli nūragainā sārĕ jarayagure
saligāli yī yiṁti sallani niḍūrbu
(||tana||)
tĕgi tummĕdala nela tiṭṭagure sadulu
pagaḍum̐ dummĕda liṁtibābaḍigŏppu
migulam̐ jilugalanu mĕṟasi kobiṁchagure
pagavu silugagūm̐te paḍam̐ti palugulu
(||tana||)
vĕnnĕlalabai naṁta vesaragure viూru
vĕnnĕlalu yinnayunu vĕlam̐dinavvu
yinniḍānu śhrīveṁkaḍeśhum̐ḍu yī kāṁtam̐ gūḍĕ
panni yīdam̐ḍe yiṁti prāṇabaṁdugum̐ḍu