Tanasitta mettumduno taga veṟumgudu nenu

తనచిత్త మెట్టుండునో తగ వెఱుఁగుదు నేను
Language

(॥పల్లవి॥)
తనచిత్త మెట్టుండునో తగ వెఱుఁగుదు నేను
వినయము గొంత చూపి వెలసేఁ గాకా

(॥॥)
యేలినవాఁడు నన్ను నిట్టే మన్నించకుండినా
కోలుముందుగాఁ గొంత కొసరేఁగాక
చేల కొంగంటినవాఁడు చెనకఁడా యెప్పుడును
వాలుకచూ పాతనిపై వంచేఁ గాకా

(॥॥)
కప్పుర మంపినవాఁడు కౌఁ గిటికి వచ్చునేకా
పిప్పి గట్ట మరి నవ్వి పెనఁగేఁ గాక
యిప్పుడు బత్తిగలవాఁ డెప్పుడూనుఁ జుట్ట మౌనే
దప్పికి మోవి యడిగి తనిసేఁగాక

(॥॥)
చేతికి లోనైనవాఁడు సిగ్గువడునా యిఁక
ఘతలఁ గౌఁగిటఁ గూడి కలసేఁగాక
యీతఁడు శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
కాతరాన నా పయ్యద గప్పెఁగాకా

(||pallavi||)
tanasitta mĕṭṭuṁḍuno taga vĕṟum̐gudu nenu
vinayamu gŏṁta sūbi vĕlasem̐ gāgā

(||||)
yelinavām̐ḍu nannu niṭṭe manniṁchaguṁḍinā
kolumuṁdugām̐ gŏṁta kŏsarem̐gāga
sela kŏṁgaṁṭinavām̐ḍu sĕnagam̐ḍā yĕppuḍunu
vālugasū pādanibai vaṁchem̐ gāgā

(||||)
kappura maṁpinavām̐ḍu kaum̐ giḍigi vachchunegā
pippi gaṭṭa mari navvi pĕnam̐gem̐ gāga
yippuḍu battigalavām̐ ḍĕppuḍūnum̐ juṭṭa maune
dappigi movi yaḍigi tanisem̐gāga

(||||)
sedigi lonainavām̐ḍu sigguvaḍunā yim̐ka
ghadalam̐ gaum̐giḍam̐ gūḍi kalasem̐gāga
yīdam̐ḍu śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
kādarāna nā payyada gappĕm̐gāgā