తనచిత్త మెఱఁగము తగుల నెట్టు వచ్చునే
(॥పల్లవి॥)
తనచిత్త మెఱఁగము తగుల నెట్టు వచ్చునే
చెనకేఁ గానీ ముందే సేసవెట్టు మనవే
(॥॥)
ననుపు గలసతులు నవ్వితే నమరుఁ గాక
పెనఁగితే వింతవారు ప్రియమయ్యేరా
చనవు గలిగితేను సరసమాడుట గాక
మనసెనయనిచోట మచ్చిక గలుగునా
(॥॥)
పిలిచితేఁ గొంతగొంత బిగియఁగవచ్చుఁ గాక
తలఁచకుండఁగ వచ్చి తమిరేఁతురా
వలపుగలుగుచోట వాడిక సేతురుగాక
కెలనిచుట్టాలు రతికేలి సేయఁ దగునా
(॥॥)
చెక్కునొక్కి వేఁడుకొంటే సిగ్గువడవచ్చుఁ గాక
అక్కడిమోమై యుండఁ గా నంటవచ్చునా
యిక్కు వెరిఁగి శ్రీ వేంకటేశుఁ డే నంన్నేలెఁ గాక
తక్కినవారికినెల్లాఁ దడవఁ గ పచ్చునా
(||pallavi||)
tanasitta mĕṟam̐gamu tagula nĕṭṭu vachchune
sĕnagem̐ gānī muṁde sesavĕṭṭu manave
(||||)
nanubu galasadulu navvide namarum̐ gāga
pĕnam̐gide viṁtavāru priyamayyerā
sanavu galigidenu sarasamāḍuḍa gāga
manasĕnayanisoḍa machchiga galugunā
(||||)
pilisidem̐ gŏṁtagŏṁta bigiyam̐gavachchum̐ gāga
talam̐saguṁḍam̐ga vachchi tamirem̐turā
valabugalugusoḍa vāḍiga sedurugāga
kĕlanisuṭṭālu radigeli seyam̐ dagunā
(||||)
sĕkkunŏkki vem̐ḍugŏṁṭe sigguvaḍavachchum̐ gāga
akkaḍimomai yuṁḍam̐ gā naṁṭavachchunā
yikku vĕrim̐gi śhrī veṁkaḍeśhum̐ ḍe naṁnnelĕm̐ gāga
takkinavāriginĕllām̐ daḍavam̐ ga pachchunā