(॥పల్లవి॥)
తనసంది నాసందిఁ దలపోఁతలా
వెనకముందు మరి వినుకొనేఁగాకా
(॥తన॥)
వద్దనేనా నేనూ వడిఁ దా విచ్చేసితేను
గద్దరిమా కోపమెంత కట కటా
అద్దలించఁగలమా ఆతనితో బలిమా
తిద్దరాని తనమేలు తెలిసేఁగాక
(॥తన॥)
యెదురాడేనా నేను యేమని తాఁజెప్పినాను
గదరుకోఁజోటేది కటకటా
పదరేటిదాననా పతియౌత గాననా
అదనైన యందాఁకా నాలకించేఁగాను
(॥తన॥)
వొల్ల ననేనా నేను వూరకే తాఁగూడఁగాను
కల్ల దాఁ జేసెనంటినా కటకటా
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డిదె నన్నుఁ గాఁగిలించె
చెల్లించేఁ దనచనవు చెప్పుకొనేఁ గాక
(||pallavi||)
tanasaṁdi nāsaṁdim̐ dalabom̐talā
vĕnagamuṁdu mari vinugŏnem̐gāgā
(||tana||)
vaddanenā nenū vaḍim̐ dā vichchesidenu
gaddarimā kobamĕṁta kaḍa kaḍā
addaliṁcham̐galamā ādanido balimā
tiddarāni tanamelu tĕlisem̐gāga
(||tana||)
yĕdurāḍenā nenu yemani tām̐jĕppinānu
gadarugom̐joḍedi kaḍagaḍā
padareḍidānanā padiyauda gānanā
adanaina yaṁdām̐kā nālagiṁchem̐gānu
(||tana||)
vŏlla nanenā nenu vūrage tām̐gūḍam̐gānu
kalla dām̐ jesĕnaṁṭinā kaḍagaḍā
yillidĕ śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannum̐ gām̐giliṁchĕ
sĕlliṁchem̐ danasanavu sĕppugŏnem̐ gāga