Tanamtane vachche melu taravulu vettanela

తనంతనే వచ్చె మేలు తరవులు వెట్టనేల
Language

(॥పల్లవి॥)
తనంతనే వచ్చె మేలు తరవులు వెట్టనేల
తనిసి తనిసి లోలోఁ దలఁచుకొంటఁగాక

(॥తనం॥)
చనవిచ్చి యాతఁడు నాసంగడి నుండఁగాను
మనపు లేమి చెప్పీనే మాఁటిమాఁటికి
ననుఁ జూచి యాతఁడు నవ్వులు నవ్వఁగాను
వినయముతో నింకా వేఁడుకొనవలెనా

(॥తనం॥)
సరసములాడి నా చనుగుబ్బ లంటఁగాను
మరిగించుకొనేలే మాఁపు దాఁకాను
వరుస దప్పక నాపై వలపులు చల్లఁగాను
తరితీపు సేసి యెట్టి తమి రేఁచేవే

(॥తనం॥)
కైవసమై నన్ను నిట్టె కాఁగిలించుకొనఁగాను
వావు లేమి చెప్పీనే వంటు వెట్టుక
శ్రీవేంకటేశుఁ డిట్టె చిత్తగించి నన్ను నేలె
వేవేలకు నాడుకొన వేడుకాయఁగదవే

(||pallavi||)
tanaṁtane vachchĕ melu taravulu vĕṭṭanela
tanisi tanisi lolom̐ dalam̐sugŏṁṭam̐gāga

(||tanaṁ||)
sanavichchi yādam̐ḍu nāsaṁgaḍi nuṁḍam̐gānu
manabu lemi sĕppīne mām̐ṭimām̐ṭigi
nanum̐ jūsi yādam̐ḍu navvulu navvam̐gānu
vinayamudo niṁkā vem̐ḍugŏnavalĕnā

(||tanaṁ||)
sarasamulāḍi nā sanugubba laṁṭam̐gānu
marigiṁchugŏnele mām̐pu dām̐kānu
varusa dappaga nābai valabulu sallam̐gānu
taridību sesi yĕṭṭi tami rem̐seve

(||tanaṁ||)
kaivasamai nannu niṭṭĕ kām̐giliṁchugŏnam̐gānu
vāvu lemi sĕppīne vaṁṭu vĕṭṭuga
śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ sittagiṁchi nannu nelĕ
vevelagu nāḍugŏna veḍugāyam̐gadave