Tanamtane mamchivayyee taravaadi panulellaa

తనంతనే మంచివయ్యీ తరవాతి పనులెల్లా
Language

(॥పల్లవి॥)
తనంతనే మంచివయ్యీ తరవాతి పనులెల్లా
యెనసి యాతని వంక లెట్టు దిద్దే మిపుడు

(॥తనం॥)
మలసి వొడఁబరచ మనవసమా ఆతఁడు
తెలిసి మాటలనే పందిలి వెట్టీని
కలికి చెనకితేనే గడును విడుచుఁగాక
చెలుల మీతని నేమిసేయఁగల మిపుడు

(॥తనం॥)
తాటించిపెనఁగ మనతరములా యీతఁడు
తేటలనేరుపులు గాదెలఁబోసీని
నాటించేయింతిగోరిక నయానకు వచ్చుఁగాక
యేటతోఁ జెలుల మింతే యేమిసేసే మిపుడు

(॥తనం॥)
చిమ్మిరేఁచ నోపుదుమా శ్రీవేంకటేశ్వరుఁడూ
ముమ్మడిఁ దననిజమే మొలపించీని
పమ్మి యలమేలుమంగ పైకొనఁగాఁ గూడెఁగాక
ఇమ్ముల నిద్దరిభావ మెట్టు మెచ్చే మిపుడు

(||pallavi||)
tanaṁtane maṁchivayyī taravādi panulĕllā
yĕnasi yādani vaṁka lĕṭṭu didde mibuḍu

(||tanaṁ||)
malasi vŏḍam̐barasa manavasamā ādam̐ḍu
tĕlisi māḍalane paṁdili vĕṭṭīni
kaligi sĕnagidene gaḍunu viḍusum̐gāga
sĕlula mīdani nemiseyam̐gala mibuḍu

(||tanaṁ||)
tāḍiṁchibĕnam̐ga manadaramulā yīdam̐ḍu
teḍalanerubulu gādĕlam̐bosīni
nāḍiṁcheyiṁtigoriga nayānagu vachchum̐gāga
yeḍadom̐ jĕlula miṁte yemisese mibuḍu

(||tanaṁ||)
simmirem̐sa nobudumā śhrīveṁkaḍeśhvarum̐ḍū
mummaḍim̐ dananijame mŏlabiṁchīni
pammi yalamelumaṁga paigŏnam̐gām̐ gūḍĕm̐gāga
immula niddaribhāva mĕṭṭu mĕchche mibuḍu