Tanamtam daa neramgamdu talabimchave

తనంతఁ దా నెరఁగఁడు తలపించవే
Language

(॥పల్లవి॥)
తనంతఁ దా నెరఁగఁడు తలపించవే
వెనకటి మాయ నేఁడు విడు మనవే

(॥తనం॥)
వీసమంత నవ్వితేనే వెడ్డు వెట్టి యడిగేవు
రేసుదీర నీతోడ రేపు చెప్పినే
బేసబెల్లి రమణుఁడు పెనఁగీ నాతోఁ జెరఁగు
మాసి వున్నదాన నేఁడు మాను మనవే

(॥తనం॥)
తలవంచుకొంటి నంటా తరచుగ నొరసేపు
చలము బయట వేసే జాము వోనీవే
బలిమి రమణుఁడేల పైకొనీ దోసముతోడ
తలగున్నదాన నిట్టే దగ్గరకు మనవే

(॥తనం॥)
సిగ్గుతో నుందాననంటా శ్రీ వేంకటేశ్వరుఁ దెచ్చి
దగ్గరించి ప దొబ్బేవు తతి గానవే
యెగ్గు సిగ్గు నెరగక యితఁ డిట్టె నన్నుఁ గూడె
వొగ్గి నానాళ్ళు సేసి వున్న దాన ననవే

(||pallavi||)
tanaṁtam̐ dā nĕram̐gam̐ḍu talabiṁchave
vĕnagaḍi māya nem̐ḍu viḍu manave

(||tanaṁ||)
vīsamaṁta navvidene vĕḍḍu vĕṭṭi yaḍigevu
resudīra nīdoḍa rebu sĕppine
besabĕlli ramaṇum̐ḍu pĕnam̐gī nādom̐ jĕram̐gu
māsi vunnadāna nem̐ḍu mānu manave

(||tanaṁ||)
talavaṁchugŏṁṭi naṁṭā tarasuga nŏrasebu
salamu bayaḍa vese jāmu vonīve
balimi ramaṇum̐ḍela paigŏnī dosamudoḍa
talagunnadāna niṭṭe daggaragu manave

(||tanaṁ||)
siggudo nuṁdānanaṁṭā śhrī veṁkaḍeśhvarum̐ dĕchchi
daggariṁchi pa dŏbbevu tadi gānave
yĕggu siggu nĕragaga yidam̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
vŏggi nānāḽḽu sesi vunna dāna nanave