తనంతఁ దా నెఱఁగఁడు తగులక నాకుఁ బోదు
(॥పల్లవి॥)
తనంతఁ దా నెఱఁగఁడు తగులక నాకుఁ బోదు
చెనకఁగ నైనదయ్యీ సిగ్గులు వడకురే
(॥తనంత॥)
యేమా టయినఁ గాని యెగ్గు దప్పు లైనఁ గాని
ఆమాఁటే నామాటగా ననరే మీరు
వేమారుఁ దనతోడ వేసరితి మిన్నిటాను
వోముచు నెన్నాళ్ల దాఁకా వోరుచుక వుందునే
(॥తనంత॥)
వాసి వంతు లైనాఁ గాని వైపు లెట్టయినాఁ గాని
సేసినదే నాచేఁత చెల్లెనే మీకు
మోసపోతి నిన్నాళ్లు మొగమోటములనే
పాసితే వలపులు చేపట్ట నెట్టు వచ్చునే
(॥తనంత॥)
చేతికి లో నైనాఁ గాని సేసినట్టే సేయనీ
మీతగవే నాతగవు మీరరే మీరు
యీతల శ్రీవెంకటేశుడింతలో విచ్చేసి కూడె
యీతలఁపు నేఁడు గాక యిన్నాళ్లు నెందుండునే
(||pallavi||)
tanaṁtam̐ dā nĕṟam̐gam̐ḍu tagulaga nāgum̐ bodu
sĕnagam̐ga nainadayyī siggulu vaḍagure
(||tanaṁta||)
yemā ṭayinam̐ gāni yĕggu dappu lainam̐ gāni
āmām̐ṭe nāmāḍagā nanare mīru
vemārum̐ danadoḍa vesaridi minniḍānu
vomusu nĕnnāḽla dām̐kā vorusuga vuṁdune
(||tanaṁta||)
vāsi vaṁtu lainām̐ gāni vaibu lĕṭṭayinām̐ gāni
sesinade nāsem̐ta sĕllĕne mīgu
mosabodi ninnāḽlu mŏgamoḍamulane
pāside valabulu sebaṭṭa nĕṭṭu vachchune
(||tanaṁta||)
sedigi lo nainām̐ gāni sesinaṭṭe seyanī
mīdagave nādagavu mīrare mīru
yīdala śhrīvĕṁkaḍeśhuḍiṁtalo vichchesi kūḍĕ
yīdalam̐pu nem̐ḍu gāga yinnāḽlu nĕṁduṁḍune