తనంత వచ్చినదెల్లా తరితీపు లేలౌను
(॥పల్లవి॥)
తనంత వచ్చినదెల్లా తరితీపు లేలౌను
పెనఁగులాటలమీఁదఁ బ్రియములౌఁ గాక
(॥తనం॥)
కానుకిచ్చినాపె వద్దఁ గాచుకుండఁగా నెక్కడో
మానినులతో నీవు మాటలాడేవు
పూనిపట్టి విడెమిచ్చేపొలఁతి యటుండఁగాను
మానక చేయిచాఁచేవు మరొక తేమీఁదను
(॥తనం॥)
చేరి వుండినాపె నిన్నుఁ జెనకుచునుండఁగాను
వూరివారిఁ జూచి నీవు వువ్విళ్లూరేవు
కోరినీకుఁ బాదాలొత్తేకొమ్మ నీతో నవ్వఁగాను
తేరకత్తెలతో నేల తెగడవచ్చేవు
(॥తనం॥)
కొలువుసేసేయాపె కోరివేఁడీఁ దగులఁగా
నలమేల్మంగరతికి నాసపడేవు
యెలమి శ్రీవేంకటేశ ఇందరు నీ కుండఁగాను
లవి మోహపుటాపెమేలము మెచ్చేవు
(||pallavi||)
tanaṁta vachchinadĕllā taridību lelaunu
pĕnam̐gulāḍalamīm̐dam̐ briyamulaum̐ gāga
(||tanaṁ||)
kānugichchinābĕ vaddam̐ gāsuguṁḍam̐gā nĕkkaḍo
māninulado nīvu māḍalāḍevu
pūnibaṭṭi viḍĕmichchebŏlam̐ti yaḍuṁḍam̐gānu
mānaga seyisām̐sevu marŏga temīm̐danu
(||tanaṁ||)
seri vuṁḍinābĕ ninnum̐ jĕnagusunuṁḍam̐gānu
vūrivārim̐ jūsi nīvu vuvviḽlūrevu
korinīgum̐ bādālŏttegŏmma nīdo navvam̐gānu
teragattĕlado nela tĕgaḍavachchevu
(||tanaṁ||)
kŏluvuseseyābĕ korivem̐ḍīm̐ dagulam̐gā
nalamelmaṁgaradigi nāsabaḍevu
yĕlami śhrīveṁkaḍeśha iṁdaru nī kuṁḍam̐gānu
lavi mohabuḍābĕmelamu mĕchchevu