Tanamta neṟamgadu taa neegemaaya

తనంత నెఱఁగడు తా నీకెమాయ
Language

(॥పల్లవి॥)
తనంత నెఱఁగడు తా నీకెమాయ
ఇనుమడిగా మీరే యెచ్చరించరే

(॥॥)
పువ్వులవాట్లు మేనఁ బుప్పొడిచొప్పులె త్తిచ్చీ
యివ్వల నూరకే నిజాలేల చేసీనే
చివ్వనఁ దలమై తానే జగిఁ జూచుకోఁడో యేమో
యివ్వల మీరైనాఁ జెలు లెచ్చరించరే

(॥॥)
పన్నీరువసంతాలు పైచారలు చూపిచ్చీ
చెన్నుమీర సాకిరేల చెప్పించీనే
అన్నిటా దనసింగారా లద్దములోఁ జూడఁడేమో
యిన్నిటా మీరైనాఁ జెలు లెచ్చరించరే

(॥॥)
కూడినచన్నులతాఁ కులకుమ్మలే పట్టియిచ్చీ
యీడనే శ్రీ వేంకటేశుఁ డేల దాఁచీనే
యీడగా నన్నేలె నాయెఱుక దెలియఁడేమో
యీడేరె మీరైనాఁ జెలు లెచ్చరించరే

(||pallavi||)
tanaṁta nĕṟam̐gaḍu tā nīgĕmāya
inumaḍigā mīre yĕchchariṁchare

(||||)
puvvulavāṭlu menam̐ buppŏḍisŏppulĕ ttichchī
yivvala nūrage nijālela sesīne
sivvanam̐ dalamai tāne jagim̐ jūsugom̐ḍo yemo
yivvala mīrainām̐ jĕlu lĕchchariṁchare

(||||)
pannīruvasaṁtālu paisāralu sūbichchī
sĕnnumīra sāgirela sĕppiṁchīne
anniḍā danasiṁgārā laddamulom̐ jūḍam̐ḍemo
yinniḍā mīrainām̐ jĕlu lĕchchariṁchare

(||||)
kūḍinasannuladām̐ kulagummale paṭṭiyichchī
yīḍane śhrī veṁkaḍeśhum̐ ḍela dām̐sīne
yīḍagā nannelĕ nāyĕṟuga dĕliyam̐ḍemo
yīḍerĕ mīrainām̐ jĕlu lĕchchariṁchare