Tanamdu kallalegunna taanela raadu maanini

తనందు కల్లలేకున్న తానేల రాదు మానిని
Language

(॥పల్లవి॥)
తనందు కల్లలేకున్న తానేల రాదు మానిని
మన కొలఁది వచ్చే సామన్యుఁడా వీఁడు

(॥తనందు॥)
సరుస నే నన్న వెల్ల సరిరాఁగా నవ్వీఁగాక
కెరలి యింతక కోపగించఁడా వీఁడు
వొర దుయ్యక తొమ్మిది వూరకే కోపించేవాఁడు
వొరసి నాతిట్లకు వోరిచీనా వీఁడు

(॥తనందు॥)
కడుఁ దనచేయిమీదు గాఁగానే వున్నాఁడు గాక
గడుసైన మాసటీఁడు గాఁడా వీఁడు
అడరి తననీడకే అలిగేటి యట్టివాఁడు
వెడఁగు నాఘాతలకు వెరచీనా వీఁడు

(॥తనందు॥)
యెవ్వతో అప్పణ దనకియ్యఁగా నున్నాఁడుగాక
ఇవ్వల లోనయ్యేవాఁడా ఇంతటవీఁడు
రవ్వగా శ్రీవేంకటాద్రిరాయఁ డిట్టె నన్నుఁగూడె
పవ్వళించి నను నింకఁ బాసీనా వీఁడు

(||pallavi||)
tanaṁdu kallalegunna tānela rādu mānini
mana kŏlam̐di vachche sāmanyum̐ḍā vīm̐ḍu

(||tanaṁdu||)
sarusa ne nanna vĕlla sarirām̐gā navvīm̐gāga
kĕrali yiṁtaga kobagiṁcham̐ḍā vīm̐ḍu
vŏra duyyaga tŏmmidi vūrage kobiṁchevām̐ḍu
vŏrasi nādiṭlagu vorisīnā vīm̐ḍu

(||tanaṁdu||)
kaḍum̐ danaseyimīdu gām̐gāne vunnām̐ḍu gāga
gaḍusaina māsaḍīm̐ḍu gām̐ḍā vīm̐ḍu
aḍari tananīḍage aligeḍi yaṭṭivām̐ḍu
vĕḍam̐gu nāghādalagu vĕrasīnā vīm̐ḍu

(||tanaṁdu||)
yĕvvado appaṇa danagiyyam̐gā nunnām̐ḍugāga
ivvala lonayyevām̐ḍā iṁtaḍavīm̐ḍu
ravvagā śhrīveṁkaḍādrirāyam̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
pavvaḽiṁchi nanu niṁkam̐ bāsīnā vīm̐ḍu