తనమర్మ మొకరితోఁ దడవేవారు గలరా
(॥పల్లవి॥)
తనమర్మ మొకరితోఁ దడవేవారు గలరా
పనిలేనివారికేల పచరించేవయ్యా
(॥॥)
చెల్లుబడిగలచెలి చెప్పినదెల్లా మాట
యెల్లచోటఁ బతికిఁ దోయఁగరాదు
పల్లదాన నిన్ను నాకె పలికినందుకుఁ గాను
చెల్లఁబో సతులకేల చెప్పేవయ్యా
(॥॥)
సేసవెట్టిన మగువ సేసిన దెల్లాఁ జేఁత
వాసిఁ బెండ్లికొడుకు వద్దనరాదు
చేసూటి కొనగోరఁ జెనకినంతటిలోనె
యీసరిత లొరులకు నేలచూపేవయ్యా
(॥॥)
ననిచికూడినకాంత నవ్వినదెల్లా నవ్వు
వొనరి ప్రాణేశ్వరున కొడ్డుకోరాదు
యెనసి శ్రీ వేంకటేశ యీకె నిన్నుఁ గేరెనంటా
తనిసినవారికేల తలపించేవయ్యా
(||pallavi||)
tanamarma mŏgaridom̐ daḍavevāru galarā
panilenivārigela pasariṁchevayyā
(||||)
sĕllubaḍigalasĕli sĕppinadĕllā māḍa
yĕllasoḍam̐ badigim̐ doyam̐garādu
palladāna ninnu nāgĕ paliginaṁdugum̐ gānu
sĕllam̐bo sadulagela sĕppevayyā
(||||)
sesavĕṭṭina maguva sesina dĕllām̐ jem̐ta
vāsim̐ bĕṁḍligŏḍugu vaddanarādu
sesūḍi kŏnagoram̐ jĕnaginaṁtaḍilonĕ
yīsarida lŏrulagu nelasūbevayyā
(||||)
nanisigūḍinagāṁta navvinadĕllā navvu
vŏnari prāṇeśhvaruna kŏḍḍugorādu
yĕnasi śhrī veṁkaḍeśha yīgĕ ninnum̐ gerĕnaṁṭā
tanisinavārigela talabiṁchevayyā